Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యాదగిరిగుట్టలో పిల్లి మిస్సింగ్‌ కేసు.. పిల్లలు అన్నం తినడం లేదని ఆవేదన

చాలామందికి పెట్స్ అంటే చాలా ఇష్టం. కొందరికైతే ప్రాణం. ప్రజంట్ జనరేషన్‌లో స్వచ్చంగా ప్రేమను వ్యక్తపరిచేవి పెట్స్ మాత్రమే...

Telangana: యాదగిరిగుట్టలో పిల్లి మిస్సింగ్‌ కేసు..  పిల్లలు అన్నం తినడం లేదని ఆవేదన
Cat Goes Missing
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2021 | 3:09 PM

చాలామందికి పెట్స్ అంటే చాలా ఇష్టం. కొందరికైతే ప్రాణం. ప్రజంట్ జనరేషన్‌లో స్వచ్చంగా ప్రేమను వ్యక్తపరిచేవి పెట్స్ మాత్రమే అని నమ్మేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. మనుషుల ప్రేమ, విశ్వాసం గురించి ఈ కాలంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని వారి భావన. ఈ విషయంలో జంతువులు వంద రెట్లు మేలని ఉదాహరణలతో సహా చూపెడుతున్నారు. అందుకే ప్రజంట్ జనరేషన్‌లో చాలామంది పెట్స్‌కు తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. వాటికి చిన్న ఇబ్బంది అయినా తట్టుకోలేకపోతున్నారు.

అలానే యాదగిరిగుట్ట మండలం గౌరయపల్లికి చెందిన గుజ్జుల రామచంద్ర రెడ్డి కుటుంబం కూడా ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. దాన్నో జంతువులా కాకుండా వారి  ఇంట్లో ఒకరిగా సాకుతున్నారు. ముఖ్యంగా రామచంద్ర రెడ్డి పిల్లలు ఆ పిల్లికి బాగా అటాచ్ అయ్యారు. అయితే  ఊహించని ఆ పిల్లి తాజాగా అదృశ్యమయ్యింది. చుట్టుపక్కల వెతికినా కూడా ప్రయోజనం కనిపించలేదు. దీంతో గుజ్జుల రామచంద్ర రెడ్డి తన పెంపుడు పిల్లి  అపహరణకు గురైందని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పిల్లి కనిపించకపోవడంతో రెండు రోజుల నుంచి తన కొడుకులు అన్నం తినడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరితగతిన పిల్లి ఆచూకి కనుగొనాలని అతడు ఫిర్యాదులో కోరాడు. పిల్లి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ

తస్సాదియ్యా.. ఏమి ఐడియా గురూ… నెట్టింట ట్రెండింగ్