Viral Video: కోపంతో ఊగిపోయిన రాటిల్ స్నేక్.. దాని శబ్దం వింటే ఒళ్ళు గగుర్పొడిచిద్ది..!!
పాములన్నింటిలో రాటిల్ చాలా ప్రమాదకరమైనది.. ఎక్కువ గా ఎడారి ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది ఈ పాము. అత్యంత విషపూరితమైన ఈ పాము కాటువేస్తే గంట వ్యవధిలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
Viral Video: పాములన్నింటిలో రాటిల్ స్నేక్ చాలా ప్రమాదకరమైనది.. ఎక్కువగా ఎడారి ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది ఈ పాము. అత్యంత విషపూరితమైన ఈ పాము కాటువేస్తే గంట వ్యవధిలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. గోధుమ రంగులో ఉండే ఈ పాము ఇసుకలో కనిపించకుండా దాక్కొని వేటాడుతుంది. ఇలాంటి పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవాలి.. కాస్త అటు ఇటు అయినా దాని కాటుకు బలి కావాల్సిందే.. తాజాగా రాటిల్ స్నేక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ ఇంటి ఆవరణలోకి ఈ ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ వచ్చింది. ఆ ఇంటి యజమాని దానిని గమనించి పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసింది.
ఆ పామును పట్టుకోవడానికి.. పాములు పట్టే వ్యక్తి ఒక బకెట్‌తో అక్కడికి వచ్చాడు. అతడిని చూసిన పాము.. బుసలు కొడుతూ కోపంతో ఊగిపోయింది. రాటిల్ స్నేక్ కోపం వచ్చిన్నప్పుడు దాని తోకను ఆడిస్తుంది. ఇక్కడ కూడా ఈ పాము కొపంతో దాని తోకను ఆడించింది.. ఆ శబ్ధం చాలా భయంకరంగా అనిపించింది. ఇక ఆ వ్యక్తి పామును పట్టుకునేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. తన వద్ద ఉన్న స్టిక్‌తో ఆ పామును చాకచక్యంగా పట్టుకొని బకెట్‌లో వేసేశాడు. అయినా కూడా ఆ పాము తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. కోపంతో బకెట్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :