Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet Awareness: హెల్మెట్ విషయంలో మీరూ ఈ ఏడు తప్పులు చేస్తున్నారా..? ఈ వీడియోను చూసి ఇకనైనా మారండి..

Hyderabad City police: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఎక్కువగా వాహనదారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ ఘటనల్లో బైక్ ప్రమాదాలే

Helmet Awareness: హెల్మెట్ విషయంలో మీరూ ఈ ఏడు తప్పులు చేస్తున్నారా..? ఈ వీడియోను చూసి ఇకనైనా మారండి..
Hyderabad City Police
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 08, 2021 | 12:50 PM

Hyderabad City police: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఎక్కువగా వాహనదారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ ఘటనల్లో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్లే వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల నిత్యం చాలామంది మరణిస్తున్నారు. హెల్మెట్ ప్రాముఖ్యత గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వారి కుటుంబాలను విషాదంలో మునిగేలా చేస్తున్నారు. తాజాగా హెల్మెట్ ప్రాముఖ్యత గురించి తెలంగాణ హైదరాబాద్ సిటీ పోలీసులు ఓ వీడియోను ట్విట్ చేశారు. జీవితం చాలా విలువైనది, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి.. అంటూ సందేశాత్మక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో ద్విచక్రవాహనదారులు చేసే తప్పులను ఎత్తిచూపుతూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఉండంటూ అంటూ వాహనదారులకు సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ పెట్టుకుని పాపతో ఉంటాడు. దీనిలో ద్విచక్రవాహనదారులు సాధారణంగా చేసే తప్పుల గురించి చెప్పి హెల్మెట్ ప్రాముఖ్యత గురించి వివరిస్తాడు. రాజ్యాంగంలో మనకు ఏడు ప్రాథమిక హక్కులుంటే.. మనం హక్కులను కొన్ని సొంతంగా రాసుకున్నాం.. 1. పాల ప్యాకెట్‌కు రోడ్డు చివరి వరకేగా వెళ్లేది హెల్మెట్ అవసరం లేదు. 2. పార్టీలకు డబ్బు ఖర్చు పెడతాం కానీ.. తక్కువ ధరకు హెల్మెట్ కొనాలి. 3. జుట్టు ఊడిపోతుంది కావున హెల్మెట్ పెట్టుకోకూడదు.

4.హెల్మెట్ కొనుక్కోవాలి కానీ.. బండి ట్యాంకు మీద పెట్టి స్టైలిగ్‌గా ఉంచాలి.. తలకు పెట్టుకోకూడదు. 5. పోలీసులు లేరు కావున హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 6. మనం హెల్మెట్ కొనుక్కుంటే చాలు.. పిల్లలకు అవసరం లేదు. 7. హెల్మెట్ పెట్టుకోవాలంటూ ఎవరైనా చెబితే వారంతా ముర్ఖుడు ఎవరూ లేరు.. ఇదండి మన సమాజం అంటూ సందేశంలో పేర్కొంటాడు. ఇలాంటివి పక్కకు పెట్టి.. ఇప్పటికైనా హెల్మెట్ పెట్టుకోవాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్ చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన ట్విట్ ..

Also Read:

Viral News: ఈ ఎద్దును తీసుకెళ్లండి మహాప్రభో.. ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్న జనం..

Viral Video: సినీ ఫక్కీలో కిడ్నాపర్లకు చుక్కలు చూపించిన పోలీస్.. కారుపై దూకి హీరోలా వెంటాడాడు.. వీడియో..

మ్యాడ్ స్క్వేర్ అందరినీ నవ్వించిందా.. మూవీపై రెస్పాన్స్ ఇదే?
మ్యాడ్ స్క్వేర్ అందరినీ నవ్వించిందా.. మూవీపై రెస్పాన్స్ ఇదే?
కొనసాగుతున్న TV9 వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సమ్మిట్.. లైవ్ వీడియో
కొనసాగుతున్న TV9 వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సమ్మిట్.. లైవ్ వీడియో
విక్రమ్ వీర ధీర శూర..ఈ మూవీ హిట్టా? ఫట్టా?
విక్రమ్ వీర ధీర శూర..ఈ మూవీ హిట్టా? ఫట్టా?
ధోని ఎంట్రీతో గర్జించిన చెపాక్.. 120 డెసిబెల్ మోత!
ధోని ఎంట్రీతో గర్జించిన చెపాక్.. 120 డెసిబెల్ మోత!
ధ్యావుడా.. ఓర్రీ మేనేజర్ టాలీవుడ్ స్టార్ హీరోయినా.. ?
ధ్యావుడా.. ఓర్రీ మేనేజర్ టాలీవుడ్ స్టార్ హీరోయినా.. ?
ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్‌ అంబేకర్‌
ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్‌ అంబేకర్‌
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..