Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ ఎద్దును తీసుకెళ్లండి మహాప్రభో.. ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్న జనం..

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా ప్రజలకు వింత కష్టం వచ్చి పడింది. కష్టాన్ని భరించలేక.. ఏకంగా సీఎంనే వేడుకున్నారు.

Viral News: ఈ ఎద్దును తీసుకెళ్లండి మహాప్రభో.. ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్న జనం..
Bull
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 08, 2021 | 11:37 AM

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా ప్రజలకు వింత కష్టం వచ్చి పడింది. కష్టాన్ని భరించలేక.. ఏకంగా సీఎంనే వేడుకున్నారు. ఇక దాంతో వేగలేం మహాప్రభో అంటూ విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ప్రజలు భయడుతున్నది దేనికి? వారు అంతలా ప్రాథేయ పడటానికి కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. శివపురి జిల్లాలోని కొలరాస్ పట్టణంలో ఓ ఎద్దు బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఏకంగా ఇళ్లను ఆక్రమించేస్తోంది. ప్రజలను గాయపరుస్తోంది. అయితే, ఈ ఎద్దును వదిలించుకునేందుకు పట్టణ ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పలితం లేకుండా పోయింది. చివరకు ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నెంబర్ 181కి ఫోన్ చేసి.. మమ్మల్ని కాపాడండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. ఇక దాంతో వేగలేమని, మీరే ఆ ఎద్దును తీసుకెళ్లండి అంటూ ప్రాథేయపడ్డారు.

కొలరాస్ పట్టణంలో ఓ ఎద్దను అడ్డూ అదుపు లేకుండా తిరుగుతోంది. తనకు ఎవరైనా ఎదురొస్తే చాలు వారిపై దాడికి పాల్పడుతోంది. ఇళ్లలోకి, కిరాణా షాపుల్లోకి ప్రవేశించి రచ్చరచ్చ చేస్తోంది. దాంతో అక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎద్దు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ ఎద్దును పట్టణం నుంచి వేరే ప్రాంతానికి తరిమేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. పైగా రివర్స్ దాడికి పాల్పడింది ఆ ఎద్దు. అధికారులు కూడా ఆ ఎద్దును పట్టణం నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండుసార్లు దానిని బంధించి.. ఇతర ప్రాంతాలలో వదిలిపెట్టారు. కానీ, రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదన్నట్లు.. ఆ ఎద్దు మళ్లీ పట్టణానికి తిరిగి వచ్చింది. దాంతో ప్రజలు షాక్ అయ్యారు. ఈ క్రమంలో ప్రజలు మళ్లీ అధికారులకు సమాచారం అందించారు. ఎద్దును బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈసారం దూర ప్రాంతంలో విడిచి పెడతామని అధికారులు చెబుతున్నారు.

బెడ్‌రూమ్‌లో దర్జాగా సేద తీరిన ఎద్దు.. కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో ఒక ఎద్దుకు సంబంధించిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఎద్దు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించింది. మెట్ల మార్గం ద్వారా ఇంటి మూడో అంతస్తుకు చేరుకుంది. అక్కడి పడకగదిలో కూర్చొని తేరగా సేద తీరింది. అదే సమయంలో కుటుంబ సభ్యులు బెడ్‌రూమ్‌లోకి రాగా.. ఒక్కసారిగా ఎద్దు కనిపించడం అవాక్కయ్యారు. ఆ తర్వాత స్థానిక ప్రజల సహాయంతో గంటల పాటు శ్రమించి.. ఎద్దుకు ఇంటి బయటకు తరిమేశారు.

Also read:

WhatsApp: ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ప్రైవసీ ఫీచర్‌ త్వరలో రాబోతోంది..!

Madonna Sebastian : ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ మత్తెక్కించే ఫోజులు..

Nokia T20 Tablet: నోకియా టీ 20 ట్యాబ్లెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. అధిక బ్యాటరీ సామర్థ్యం..!