AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brinjal + Tomato = Brimato: అవును ఇది నిజం నమ్మండి.. ఒకే మొక్కకు వంకాయ, టమాటాలు..

వంకయా కూరంటే ఓకారమేస్తది ఒద్దు బాబయ్య.. అనే వారు కూడా వంకాయను టమాటాతో మిక్స్ చేసి వండితే మాత్రం లాగించేస్తారు. అంతలా ఇష్టపడుతున్నారు.

Brinjal + Tomato = Brimato: అవును ఇది నిజం నమ్మండి.. ఒకే మొక్కకు వంకాయ, టమాటాలు..
Brinjal And Tomato
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2021 | 11:48 AM

Share

వంకయా కూరంటే ఓకారమేస్తది ఒద్దు బాబయ్య.. అనే వారు కూడా వంకాయను టమాటాతో మిక్స్ చేసి వండితే మాత్రం లాగించేస్తారు. అంతలా ఇష్టపడుతున్నారు. అలాంటిది ఒకే మొక్కకు రెండు వంగడాలు వస్తే మరింకేమైనా ఉందా.. అద్భుతం.. మహా అద్భుతం అంటున్నారు భోజన ప్రియులు. వీరే కందండి బాబు.. రైతన్నలు కూడా పండుగ చేసుకుంటున్నారు. టమాటాకు గిట్టుబాటు ధరల లభించని సమయంలో వంకాయను మార్కెట్‌లో అమ్ముకోవచ్చని ఆనంద పడుతున్నారు. తాజాగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) శాస్త్రవేత్తలు పెద్ద విజయాన్ని సాధించారు. భారత వ్యవసాయ పరిశోధకులు ఓ అద్భుతం సృష్టించారు. ఒకే మొక్కకు రెండు వంగడాలను అభివృద్ధి చేశారు. అంటుకట్టుట సాంకేతికత ద్వారా శాస్త్రవేత్తలు అటువంటి మొక్కను అభివృద్ధి చేశారు. దీనిలో టమోటా , వంకాయలు ఒకేసారి ఉత్పత్తి చేయవచ్చు. ఈ మొక్కకు “బ్రిమాటో” అని పేరు పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారు తక్కువ స్థలంలో ఒకే మొక్క నుండి టమోటా, వంకాయ పంటలను దిగుబడి చేసుకోవచ్చు. 

వాస్తవానికి కూరగాయల ఉత్పాదకతను పెంచడానికి శాస్త్రవేత్తలు అంటుకట్టుటను ఆశ్రయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు కూరగాయలు అంటుకట్టబడతాయి. తద్వారా రెండింటి ఫలాలను ఒకే మొక్క నుండి పొందవచ్చు. అంటుకట్టుట సాంకేతికతతో తయారు చేసిన మొక్క తక్కువ సమయంలో.. తక్కువ స్థలంలో కూరగాయలను ఉత్పత్తి చేయడానికి చాలా మనవారు చేసిన ఈ పరిశోదనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.  

అంటుకట్టుట ఇలా..

ICAR  వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ద్వారా గ్రాఫ్టెడ్ పోమాటో (పొటాటో-టొమాటో) ను విజయవంతంగా ఉత్పత్తి చేసిన తరువాత, ఇప్పుడు బ్రిమాటో రకం తయారు చేయబడింది.  25 నుంచి 30 రోజుల్లో వంకాయ దిగుబడి రాగా..  22 నుండి 25 రోజుల వయస్సులో టమాటాలు వచ్చాయని ICAR తెలిపింది. 

వంకాయ రూట్‌స్టాక్ – IC 111056 (వివిధ రకాల వంకాయలు) సుమారు 5 శాతం మొలకలలో రెండు శాఖలను అభివృద్ధి చేసే ధోరణిని కలిగి ఉంది. అంటుకట్టుట సైడ్/స్ప్లైస్ పద్ధతి ద్వారా జరుగుతుంది. దీనిలో రూట్స్టాక్ , సియోన్ రెండింటిలోనూ 5 నుండి 7 మిమీ వరకు స్లాంట్ కట్స్ (45 ° యాంగిల్) చేయబడ్డాయి. అంటు వేసిన వెంటనే మార్పిడి చేసిన మొలకలను నియంత్రిత వాతావరణ స్థితిలో ఉంచారు. ఇక్కడ మొదటి 5 నుండి 7 రోజులు ఉష్ణోగ్రత, తేమ.. కాంతి సరైన విధంగా తగిలేలా ఏర్పాట్లు చేశారు. తర్వాత దానిని పాక్షిక నీడలో 5 నుండి 7 రోజులు ఉంచారు. ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్లు చెప్పారు. ఈ నూతన విధానం పట్టణ, పట్టణ శివారు ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని ఐసీఏఆర్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..