AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar: షాకింగ్ న్యూస్.. నెల రోజులు స్వీట్స్ ముట్టుకోక పోతే.. ఏం జరుగుతుందో తెలుసా..

డయాబెటిస్ వచ్చిందంటే చాలు.. ఏమి తినాలి.. ఎలాంటివి తినకూడదనే అనుమామాలు వచ్చిపడుతుంటాయి. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. అలాంటిది..

Sugar: షాకింగ్ న్యూస్.. నెల రోజులు స్వీట్స్ ముట్టుకోక పోతే.. ఏం జరుగుతుందో తెలుసా..
Sugar
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2021 | 12:23 PM

Share

డయాబెటిస్ వచ్చిందంటే చాలు.. ఏమి తినాలి.. ఎలాంటివి తినకూడదనే అనుమామాలు వచ్చిపడుతుంటాయి. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. అలాంటిది ఇక చాక్లెట్స, షుకర్ క్యాండీలతోపాటు షుగర్ ఉన్న పదార్థాలు తినడం మొత్తానికి మానేస్తారు. మీరు షుగర్ పేషెంట్ అయితే లేదా మీరు షుగర్ పేషెంట్‌గా మారే దిశగా వెళుతుంటే.. ఈ రెండు సందర్భాల్లోనూ స్వీట్లు తినవద్దని సూచించారు. అయితే తీపి ఆహారాన్ని పూర్తిగా వదిలేయాలా..? ఒక వ్యక్తి 30 రోజులు స్వీట్లు తినకపోతే ఎలా ఉంటుంది..? అటువంటి ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం.  ఎందుకంటే.. ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపెడుతున్న వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 

ఒక సర్వేలో ఇలా చెప్పారు.. 

2019 సంవత్సరంలో అమెరికాలో ఒక సర్వే జరిగింది. సగటున ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి 28 కిలోల చక్కెరను వినియోగిస్తున్నట్లు కనుగొనబడింది. శరీరానికి ఇది ప్రాణాంతకం అని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల  ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 6-7 టీస్పూన్ల చక్కెర తీసుకోవాలి. మీరు దీనిని గ్రాములలో చూస్తే అంటే కేవలం ఒక రోజులో 25-30 గ్రాముల చక్కెర మాత్రమే తినాలి. దీని కంటే ఎక్కువ తింటే మీకు రోగాలు చుట్టుముడుతాయి. అదే సమయంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మహిళలు పురుషుల కంటే తక్కువ చక్కెర తినాలని చెప్పారు. ఈ అసోసియేషన్ ప్రకారం  పురుషులు ఒక రోజులో 150 కేలరీల చక్కెర తీసుకోవాలి..అదే మహిళలు 100 కేలరీల చక్కెర మాత్రమే తీసుకోవాలి.

మీరు 30 రోజులు స్వీట్లు తినకపోతే ఏమి జరుగుతుంది?

తీపిని అనేక రకాలుగా తినవచ్చు.. కానీ మనం చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తాము. దాదాపు ప్రతి స్వీట్‌లో చక్కెరను మోతాదుకు మించి ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో తీపి పదార్థాల్లో అతి పెద్ద మూలం చక్కెర. చక్కెర తీపిగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి విషం కంటే తక్కువేంకాదు. స్వీట్ కొంతకాలం మీకు మేలు చేస్తుంది. కానీ  ఆ తరువాత అది మీ శరీరాన్ని రోగాల కుప్పగా మార్చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి 30 రోజులు చక్కెర తినడం మానేసినప్పుడు.. అతను మునుపటి కంటే మరింత శక్తివంతంగా మారిపోతారు. చికాకు కనిపించదు.. అలసట తగ్గుతుంది. కానీ ఒకేసారి చక్కెరను వదులుకోవద్దని వైద్యులు పదే.. పదే హెచ్చరిస్తున్నారు.. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి.

తీపిని విడిచిపెట్టడానికి సరైన మార్గం..?

మీరు అకస్మాత్తుగా చక్కెర తినడం మానేస్తే ఒక్కసారిగా బలహీనంగా మారిపోతారు. అలా కాకుండా నెమ్మది.. నెమ్మదిగా తగ్గిస్తూ రండీ… ఉదాహరణకు, మీరు ఉదయం టీలో 2  స్పూన్స్ చక్కెర తీసుకుంటే.. మొదట దానిని ఒకటిన్నర చేసి.. ఆ తర్వాత  నెమ్మదిగా తగ్గిస్తూ… తగ్గిస్తూ.. వదిలివేయండి. అయితే, చక్కెరకు బదులుగా పండ్లు, ధాన్యాలు వంటి తీపి పదార్థాలను తినడం కొనసాగించాలి. మీరు తీపి పదార్థాలు తినడం పూర్తిగా మానేస్తే.. అది మీ శరీరానికి ప్రమాదకరం. తీపి పదార్థాలను తినడం పూర్తిగా మానేసిన తర్వాత మీ శరీరం కొవ్వు నుండి గ్లూకోజ్ తీసుకోవడానికి కీటోన్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఈ కీటోన్లు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును గ్లూకోజ్‌గా మారుస్తాయి. దీని కారణంగా మీ కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను కీటోసిస్ అంటారు. కానీ ఈ విధంగా బరువు తగ్గడం హానికరం.. ఎందుకంటే మీ కండరాలు కీటోన్‌ల కారణంగా నొప్పిగా మారడం ప్రారంభిస్తాయి.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..