World Egg Day: గుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటో తెలుసా.? వరల్డ్ ఎగ్ డే రోజున పలు ఆసక్తికర విషయాలు..

World Egg Day 2021: పోషకాలు చౌకగా దొరికే ఆహారం కోడిగుడ్డు. రోజుకో కోడిగుడ్డ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా అక్టోబర్‌ రెండో శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవంగా...

World Egg Day: గుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటో తెలుసా.? వరల్డ్ ఎగ్ డే రోజున పలు ఆసక్తికర విషయాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 08, 2021 | 2:26 PM

World Egg Day 2021: పోషకాలు చౌకగా దొరికే ఆహారం కోడిగుడ్డు. రోజుకో కోడిగుడ్డ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా అక్టోబర్‌ రెండో శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవంగా జరుపుకొంటారు. 1996 నుంచి గుడ్డు దినోత్సవాన్ని ప్రకటించిన అంతర్జాతీయ గుడ్డు కమిషన్‌.. గుడ్డు వినియోగంలో ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్‌ 114గా ఉంది. అయితే ఏడాదికి కనీసం 180 గుడ్లు తినాలని నేషనల్‌ న్యూట్రీషన్‌ కౌన్సిల్‌ సూచిస్తోంది. మనదేశంలో తలసరి గుడ్ల వినియోగం 73 కాగా.. మెట్రోనగరాల్లో తలసరి వినియోగం 100గా ఉంది. ఉత్తరాది కన్నా దక్షిణాదిలో గుడ్డు వినియోగం ఎక్కువే.

తెలంగాణ, ఏపీలో 100 నుంచి 110 వరకు గుడ్ల వినియోగం ఉండగా, గుడ్ల ఉత్పత్తిలో భారత్‌ మూడోస్దానంలో ఉంది. కరోనా కంటే ముందు రోజుకు 26 కోట్ల గుడ్ల ఉత్పత్తి ఉండగా, కరోనా తర్వాత రోజు 21 కోట్లకు తగ్గింది. అయితే కరోనా మహమ్మారి సమయంలో కొన్ని వదంతుల కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తికి గుడ్డు మంచిదని డాక్టర్ల సలహా మేరకు మళ్లీ గుడ్ల ఉత్పత్తి పెరిగింది.

భారత్‌లో గుడ్ల ఉత్పత్తి…

దేశం ఉత్పత్తి చేసే గుడ్లలో ఏపీ వాటా 19 శాతం ఉండగా, దేశంలో గుడ్ల ఉత్పత్తులు పలు రాష్ట్రాలు ముందున్నాయి. అందులో ఏపీ, తెలంగాణ, హర్యానా,మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోని ఈ రాష్ట్రాల వాటా 60 శాతంకు పైనే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పౌల్ట్రీ సెన్సెస్ ప్రకారం .. 2019లో ఏపీ ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఇక 2014-15లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 7848.4 కోట్లు ఉండగా, 2018-19 లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 10331.8 కోట్లు, 2018-19లో ఏపీలో గుడ్ల ఉత్పత్తి 1975.4 కోట్లు తొలి స్థానంలో ఉంది. 2018-19లో 1884.2 కోట్ల ఉత్పత్తితో రెండో స్థానంలో తమిళనాడు ఉండగా, 2018-19లో 1368.9 కోట్ల ఉత్పత్తితో మూడో స్థానంలో తెలంగాణ ఉంది.

ఇదిలా ఉంటే గుడ్ల తలసరి వినియోగంలో భారత్‌ వెనుకబడిపోయింది. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. అలాగే భారతదేశంలో 70కి మించడం లేదు. గుడ్ల వాడకంలో ప్రపంచంలో మనదేశం114వ ర్యాంకు ఉంది. మన పట్టణాల్లో ఏడాదికి తలసరి గుడ్ల వాడకం 90 నుంచి 105 ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి తలసరి గుడ్ల వాడకం 50-70 ఉండగా, ఏడాదికి తలసరి గుడ్ల వాడకం 180 ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) సిఫారసు చేస్తోంది.

అలాగే ఫిబ్రవరి 2020లో తెలంగాణలో నిత్యం 3.5 కోట్లు, ఏపీలో 3 కోట్ల గుడ్ల వినియోగం ఉంది. మార్చి 2021 నాటికి దేశంలో 25 కోట్ల (లేయర్‌) గుడ్లు పెట్టే కోళ్లు ఉండగా, దేశంలో రోజుకు సగటున 21 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గుడ్డు పెట్టే కోళ్లు 8 కోట్ల పైనే ఉండగా, గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో రోజూ 3. 2 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది.

Also Read: AP Contractors Protest: నాడు పోషకులం… నేడు యాచకులం అంటూ ఏపీలో.. పోరుబాట పట్టిన కాంట్రాక్టర్లు\

Viral News: ఈ గుడిసెలో వాష్‌రూమ్ లేదు.. ధర ఎంతో తెలిస్తే షాకే.. ప్రత్యేకతలు వింటే షేకే.!

Huzurabad By Election: నిబద్ధతగల టీఆర్ఎస్‌.. అబద్ధాల బీజేపీ మధ్యే పోటీ: మంత్రి హరీశ్ రావు