Covid-19 Vaccine: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే

Covid-19 Vaccine: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంపు రానున్నదని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో..

Covid-19 Vaccine: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే
Covid 19 Jabs Tamilnadu
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2021 | 7:04 PM

Covid-19 Vaccine: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంపు రానున్నదని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశాయి.  కరోనా వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ప్రజలను చైతన్య వంతులకు చేస్తూ.. ప్రభుత్వం , అధికారులతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలు కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తేలింది..టీకా వేయించుకున్నవారికి చిన్న చిన్న బహుమతులను అందజేస్తున్నవారి గురించి తరచుగా వార్తలను వింటున్నాం.. తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకొనేలా వినూత్న ప్రచారం చేస్తున్నారు. మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తూ.. టీకా తీసుకున్నవారు పేర్లు, క్యాంపు కు జనాన్ని తీసుకొచ్చిన వలంటీర్ల పేర్లు డ్రా తీసి.. లక్కీ పర్సన్ కు వాషింగ్ మెషిన్, గ్రైండర్ వంటి వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు లోని కరూర్ జిల్లాలో వాక్సిన్ పై వినూత్నంగా ప్రచారం చేస్తూ అక్కడి ప్రజలందరూ వాక్సిన్ వేయించుకునేలా చర్యలు చేపడుతున్నారు. వ్యాక్సిన్  శిబిరానికి 25 మంది కంటే ఎక్కువ మందిని తీసుకువచ్చిన వాలంటీర్ల పేర్లు .. టీకా వేయించుకున్నవారి పేర్లు  లక్కీ డ్రాలో చేర్చబడతాయి. అనంతరం ఆదివారం జిల్లాలోని టీకా కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించి గృహోపకరణాలతో సహా బహుమతులు అందజేయనున్నారు.

తమిళనాడు ప్రభుత్వ చేపట్టిన  మెగా టీకా డ్రైవ్‌లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆదివారం టీకాలు వేసిన వారందరికీ లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందించనుందని జిల్లా కలెక్టర్ టి. ప్రభు శంకర్ చెప్పారు.  శిబిరాలకు టీకాలు వేయడానికి ప్రజలను తీసుకువచ్చే వాలంటీర్లకు కూడా రూ .5 ప్రోత్సాహక బహుమతులను అందిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఆ రోజు వాక్సిన్ వేయించుకున్న వారి పేర్లను లక్కీ డ్రా తీసి బహుమతులు కూడా అందించనున్నారు. ఫస్ట్ గిఫ్ట్ గా వాషింగ్ మెషిన్, సెకండ్ గిఫ్ట్ గ్రైండర్, థర్డ్ గిఫ్ట్ మిక్సి ఇవ్వనున్నారు. అంతేకాదు నాలుగో బహుమతిగా 25 మందికి ప్రెషర్ కుక్కర్లు, స్పెషల్ బహుమతిగా 100 మందికి వంట పాత్రలు అందించ నున్నారు. కరూర్ జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి  సుబ్రహ్మణ్యం ప్రశంసించారు.

Also Read:  మన్యం సిగలో మరో మణిహారం.. గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంకు శంకుస్థాపన..