Deputy CM Pushpa Vani: మన్యం సిగలో మరో మణిహారం.. గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంకు శంకుస్థాపన

AP Deputy CM Pushpa Vani: విశాఖ మన్యం సిగలో మరో మణిహారం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రా కాశీరంగా పేరుపొందిన లంబసింగి..

Deputy CM Pushpa Vani: మన్యం సిగలో మరో మణిహారం.. గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంకు శంకుస్థాపన
Tribal Freedom Fighters Mus
Follow us

|

Updated on: Oct 08, 2021 | 6:25 PM

AP Deputy CM Pushpa Vani: విశాఖ మన్యం సిగలో మరో మణిహారం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రా కాశీరంగా పేరుపొందిన లంబసింగి చారిత్రాత్మక మణిపూసకు కేంద్రంగా మారబోతోంది. ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాతాలతో పాటు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందనుంది. ప్రకృతి సహజసిద్ధ అందాల నడుమ 35 కోట్లతో మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ప్రకృతి సహజసిద్ధ అందాలకు కేరాఫ్ ఆంధ్రాకాశ్మీరం లంబసింగి. ప్రకృతి అందాలతో అలరారుతోన్న ఈ ప్రాంతంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న మ్యూజియం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. డిప్యూటీ సీఎ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

తాజంగి గ్రామం విశిష్టత

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలోని తాజంగి గ్రామానికి విశిష్టత ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిషు పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో ఈ ప్రాంతానికి సుస్థిత స్థానముంది. రక్షిత అడవుల పేరుతో పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటిషు పాలకులు.. ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి – చింతపల్లి రోడ్డు నిర్నాణానికి కూలీలుగా ఉపయోగించుకునేవారు. అయితే శ్రమదోపిడీ చేసే బ్రిటిష్ వారు సరైన కూలీ చెల్లించక పోవడంతో పాటు అత్యాచారాలు, అకృత్యాలకు పాల్పడేవారు. ఈ నేపధ్యంలోనే బ్రిటిషు పాలకుల అరాచకాలపై అల్లూరి మొట్టమొదటిసారిగా తిరగబడ్డారు. గంటందొర, మల్లుదొరలతో కలిసి బ్రిటిషు పాలకులపై ఇక్కడినుంచే తిరుగుబాటును లేవనెత్తి బ్రిటిషు అధికారులను తరిమికొట్టారు. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగి ఉన్న కారణంగానే గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి తాజంగిని ఎంచుకున్నారు.

మ్యూజియం నిర్మాణం

గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్ టీఎం) ఆధ్వర్యంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను 22 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మ్యూజియం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో 20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం, 15 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో మ్యూజియం నిర్మాణాలకు 13 కోట్లను వినియోగించనున్నారు. ఈ మ్యూజియంకు సంబంధించిన ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గంటందొర, మల్లు దొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో అధునాతనంగా డిజైన్ చేసారు. యాంపి థియేటర్ తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియో విధానాలను రూ.5 కోట్లతో సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సాంప్రదాయకమైన గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు.

గిరిజన సంస్కృతిని ప్రతిబింబింలా

అంతేకాదు..10 కోట్ల వ్యయంతో మ్యూజియం పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దనున్నారు. మరో 6 కోట్ల వ్యయంతో పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక ఆధునికమైన రెస్టారెంట్ ను, రిసార్ట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంలో ఏ,బీ,సీ,డి అనే నాలుగు జోన్లుగా వివిధ అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జోన్-ఏ లో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు పూర్వం ఉన్న గిరిజనుల పరిస్థితులు, అప్పటి గిరిజనుల జీవన విధానం, వారికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-బి లో గిరిజనుల జీవితాల్లోకి బ్రిటీష్ పాలకు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష జంతు జాలాలను కళ్లకు కడుతూ డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటు చేస్తారు. జోన్-సీ లో బ్రిటీష్ పాలకుల అరాచకాలపై గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. జోన్-డీ లో స్వాతంత్ర్యానంతరం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలను గురించి తెలిపే ప్రదర్శనలు ఉంటాయి.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

ప్రస్తుతం ఉన్న గిరిజన మ్యూజియంల కంటే భిన్నంగా, అత్యాధునికమైన సాంకేతిక విధానాలతో సర్వ సౌకర్యాలతో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను నిర్మించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొరలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించే అంశాలు ఈ మ్యూజియంను సందర్శించే పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. 22 నెలల కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నామని 2023 మార్చి నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పూర్తయ్యే విధంగా నిర్మాణ పనులు పూర్తి చేసి గిరిజన స్వాతంత్రోద్యమ మ్యూజియంను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల లోగోను ఆమె ఆవిష్కరిణ్చారు. గిరిజనుల అభ్యున్నతికి జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోందన్న డిప్యూటీ సీఎం.. గిరిజన స్వాతంత్రోద్యమ చరిత్రను భావితరా అందించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. చారిత్రక విశేషాలు ప్రతిబింబించేలా కళాకృతులతో పాటు మ్యూజియం ఆవరణలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేలా అందమైన పూల చెట్లు, మొక్కలు, క్రోటన్స్, ల్యాండ్ స్కేపింగ్ తో పార్కును తీర్చిదిద్దుతారు. సందర్శకుల కోసం రెస్టారెంట్, రిసార్ట్ కూడా నిర్మిస్తామని చెప్పారు.

Reporter : Khaja Tv9 telugu, vizag

Also Read: దేశ విదేశీయులను ఆకర్షించే మైసూర్ దసరా ఉత్సవాలకు 411 ఏళ్ల ఘన చరిత్ర..

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా