AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ

ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను, తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా...

Poonam Kaur: నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ
Poonam Kaur
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2021 | 2:47 PM

Share

ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను, తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. మొన్నామధ్య ‘మా’ ఎన్నికల అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలిచి వార్తల్లో నిలిచారు. అనంతరం తనకు తండ్రి సమానులు దాసరి నారాయణరావు గురించి ఓ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక గురువు దాసరిగారు. ఆయనను చాలా మిస్సవుతున్నాను. దాసరిగారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. దేవుడు దానిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను..’’ అంటూ ఆమె ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది. కాగా పూనమ్ వేసే ప్రతి ట్వీట్‌లోనూ నిగూడార్థాన్ని వెతుకుతారు నెటిజన్లు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. #pklove అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోల్లో పూనమ్ కుందనపు బొమ్మలా మెరిపోతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆమె ట్వీట్‌కు విభిన్న రకాల కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు రీ ట్వీట్లు చేస్తూ.. కాంటవర్శీ వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు.  Pk అంటే పూనమ్ కౌర్ అనే అర్థం వస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలతో కొత్త పేర్లు ఊహిస్తూ నెట్టింట సదరు ట్వీట్‌ను సర్కులేట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పూనమ్ వేసిన ట్వీట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా పూనమ్ కౌర్ 2018 లో రిలీజ్ అయిన నెక్ట్స్ ఏంటి మూవీలో చివరిసారిగా నటించారు. ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. కాగా సోషల్ మీడియాలో పూనమ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read: తస్సాదియ్యా.. ఏమి ఐడియా గురూ… నెట్టింట ట్రెండింగ్