Manu Charitra: ప్రేమలో పడడం అనేది బాధతో కూడిన సంతోషం.. ఆకట్టుకుంటోన్న ‘మను చరిత్ర’ సినిమా టీజర్.
Manu Charitra: ఇంటెన్స్ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద..
Manu Charitra: ఇంటెన్స్ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ కోవలోకే వస్తోంది మరో చిత్రం ‘మను చరిత్ర’. ప్రేమ కథ చుట్టూ అల్లుకున్న ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీనే ఈ సినిమా కథ. యువతీ, యువకులు ప్రేమించుకోవడం వారి ప్రేమకు పెద్దలు కులాలు, ఆస్తి కారణాలతో అడ్డుచెప్పడం ఇలాంటి కథాంశంతో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు వచ్చినప్పటికీ ‘మను చరిత్ర’ను మరింత ఇంటెన్స్‌గా తెరకెక్కిచినట్లు తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతోంది.
శివ కందుకూరి, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. 1:48 నిమిషాల నిడివి ఉన్న ఈ సిసిమా టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. హీరో పాత్రను దర్శకుడు చాలా ఇంటెన్సివ్‌గా చూపించినట్లు అర్థమవుతోంది. టీజర్ చివర్లో వచ్చిన ‘ఫాలింగ్ ఇన్ లవ్ ఇజ్ ది పెయిన్ ఫుల్ జాయ్’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మను చరిత్ర’ కూడా అలాంటిదే కాబట్టి తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. ఇక దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘సిరాశ్రీ వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. చంద్రబోస్‌గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు’అని తెలిపారు. మరి మను చరిత్ర టీజర్ ఎలా ఉందో మీరూ ఓసారి చూసేయండి..
Also Read: Poonam Kaur: నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ
Varudu Kaavalenu : దసరా రేస్ నుంచి తప్పుకున్న నాగశౌర్య.. వెనక్కితగ్గిన ‘వరుడు కావలెను’..?
Samantha: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!