AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Bid Winner: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్‌.. ప్రభుత్వ అధికారిక ప్రకటన..

Air India Sale: ఎయిరిండియా కొనుగోలు అధికారికంగా పూర్తయింది. ఎయిరిండియా బిడ్‌ను టాటా సన్స్‌ గ్రూప్‌ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. ఎయిర్‌ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూప్‌తో పాటు స్పైస్‌ జెట్‌..

Air India Bid Winner: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్‌.. ప్రభుత్వ అధికారిక ప్రకటన..
Ratan Tata
Narender Vaitla
|

Updated on: Oct 08, 2021 | 4:27 PM

Share

Air India Sale: ఎయిరిండియా విక్రయ ప్రక్రియ  అధికారికంగా పూర్తయింది. ఎయిరిండియా కొనుగోలు  బిడ్‌ను టాటా సన్స్‌ గ్రూప్‌ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. ఎయిర్‌ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూప్‌తో పాటు స్పైస్‌ జెట్‌ బిడ్ వేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ఎయిరిండియా ఓపెన్‌ బిడ్‌ను టాటా సన్స్‌ గ్రూప్‌ రూ. 18 వేల కోట్లకు దక్కించుకుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి తుహిన్ కాంటా పాండే శుక్రవారం సాయంత్రం  అధికారికంగా ప్రకటించారు.  దీంతో ఇకపై ఎయిర్‌ ఇండియా విమానాల నిర్వహణ  బాధ్యత మొత్తం టాటా సన్స్‌ గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లనుంది.  ఎయిరిండియాలోని వంద శాతం వాటాలను టాటా గ్రూప్ కు విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాపై అన్ని హక్కులను కోల్పోయింది.  ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాల్లో ఇదో చారిత్రక ఘట్టంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఎయిరిండియాకు రూ. 60వేల కోట్ల అప్పులు ఉన్నాయి.

68 ఏళ్ల తర్వాత మళ్లీ.. టాటా చేతుల్లోకి..

ఇక ఎయిరిండియా చరిత్ర విషయానికొస్తే.. భారత స్వాతంత్ర్యానికి ముందు 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ పేరును ఎయిరిండియాగా మార్చారు. స్వాతంత్ర్యం తర్వాత ఎయిరిండియాలో 49 శాతం భాగస్వామ్యం తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 1953లో ఎయిరిండియాను జాతీయం చేసుకున్న కేంద్రం.. తాజాగా 100శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంది. డిసెంబర్‌ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్‌ చేతికి రానుంది. దీంతో 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.

నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు గ‌తంలోనూ ప్రయ‌త్నాలు జ‌రిగాయి. 2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా స్పైస్‌ జెట్‌, టాటా సన్స్‌ బిడ్స్‌ వేశాయి. ఈ బిడ్‌ను టాటా సన్స్‌ గెలుచుకోవడంతో భారీ న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటా సన్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Also Read: VH: ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నా: వీహెచ్

Konda Polam Movie Review: ఓ పర్పస్‌ ఉందని నమ్మేవారి కోసం… కొండ పొలం!

World Egg Day: గుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటో తెలుసా.? వరల్డ్ ఎగ్ డే రోజున పలు ఆసక్తికర విషయాలు..