Air India Sale: ఎయిరిండియాను హస్తగతం చేసుకున్న టాటా గ్రూప్.. సంతోషం వ్యక్తం చేస్తున్న ఇండియన్ నెటిజన్లు.
Air India Sale: ఎయిరిండియా.. సగటు భారతీయుడి ఆత్మ గౌరవ ప్రతీక.. అప్పుల ఊభిలో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఎక్కడ విదేశీ సంస్థల చేతుల్లోకి వెళుతుందని దేశ భక్తులు కలవరపడుతోన్న వేళ టాటా..
Air India Sale: ఎయిరిండియా.. సగటు భారతీయుడి ఆత్మ గౌరవ ప్రతీక.. అప్పుల ఊభిలో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఎక్కడ విదేశీ సంస్థల చేతుల్లోకి వెళుతుందని దేశ భక్తులు కలవరపడుతోన్న వేళ టాటా గ్రూప్ ఎయిరిండియాను సొంతం చేసుకుందన్న వార్త సగటు భారతీయులకు సంతోషాన్నిచ్చిందని చెప్పాలి. ఎయిరిండియాను టాటా దక్కించుకుందని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన మరుక్షణమే సోషల్ మీడియాలో ఇండియన్స్ చేస్తున్న పోస్టులే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎక్కడ విదేశీ కంపెనీలు భారతీయ కంపెనీని దక్కించుకుంటాయో అనుకున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ‘ఎయిరిండియా భారతీయులకే దక్కింది. టాటా ఎయిరిండియాను తీసుకుంది’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఎయిరిండియాకు ఇది తిరిగి సొంతింటికి వెళుతున్న అనుభవం’ అంటూ చమత్కరించాడు. ఇక మరికొందరు నెటిజన్లు రతన్ టాటాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
It stays Indian! Tata takes over Air India. ❤️ #tata #airindia
— Sidd (@siddm9) October 8, 2021
I am coming home moment for @airindiain .
— शिवांबिका (@Punya_Bhoomi) October 8, 2021
ఇదిలా ఉంటే భారత స్వాతంత్ర్యానికి ముందు 1946లో టాటా ఎయిర్‌లైన్స్ పేరును ఎయిరిండియాగా మార్చారు. స్వాతంత్ర్యం తర్వాత ఎయిరిండియాలో 49 శాతం భాగస్వామ్యం తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 1953లో ఎయిరిండియాను జాతీయం చేసుకున్న కేంద్రం.. తాజాగా 100శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంది. డిసెంబర్ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్ చేతికి రానుంది.
దీంతో 67 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా స్పైస్ జెట్, టాటా సన్స్ బిడ్స్ వేశాయి. ఈ బిడ్‌ను టాటా సన్స్ గెలుచుకోవడంతో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
Also Read: Nobel Peace Prize 2021: జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రి మురతోవ్‌లకు నోబెల్ శాంతి బహుమతి
Air India Bid Winner: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్.. ప్రభుత్వ అధికారిక ప్రకటన..
Dera baba: ఆ కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. ఈనెల 12న శిక్ష ఖరారు