AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Sale: ఎయిరిండియా చరిత్రలో మరో కొత్త అధ్యాయం.. 68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా గ్రూప్ చేతికి..

Air India privatisation: భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచిన ఎయిరిండియా చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలయ్యింది.

Air India Sale: ఎయిరిండియా చరిత్రలో మరో కొత్త అధ్యాయం.. 68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా గ్రూప్ చేతికి..
Air India Sale
Janardhan Veluru
|

Updated on: Oct 08, 2021 | 4:46 PM

Share

Air India privatisation: భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచిన ఎయిరిండియా చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలయ్యింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ – ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు దశాబ్ధాలుగా జరుగుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అధికారికంగా ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ముగిసింది.  ఎయిరిండియా సంస్థను ఓపన్ బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ దక్కించుకుంది. దీంతో 68 ఏళ్ల తర్వాత ఎయిరిండియా సంస్థ మళ్లీ టాటా గ్రూప్ చేతికి చేరింది.

రూ.18వేల కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎయిరిండియాను దక్కించుకునేందుకు టాటా సంస్థతో పోటీపడిన స్పైస్ జెట్ రూ.15,100 కోట్లకు బిడ్డింగ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికల్లా ఎయిరిండియా కొనుగోలు ప్రక్రియను టాటా సన్స్ పూర్తిచేయనుంది. 2021 డిసెంబరు నాటికి ఎయిరిండియా నిర్వహణ హక్కులు పూర్తిగా టాటా గ్రూప్ చేతికి చేరనుంది. ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకున్నట్లు గత వారమే మీడియా వర్గాల్లో ప్రచారం జరిగినా.. శుక్రవారం సాయంత్రం కేంద్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

రూ.60వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిరిండియా సంస్థకు 127 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ 42 అంతర్జాతీయ కేంద్రాలకు సర్వీసులు నడుపుతోంది. ప్రస్తుతం ఎయిరిండియాలోని 100 శాతం వాటాలను కేంద్ర ప్రభుత్వం టాటా గ్రూప్‌కు విక్రయించింది. టాటా గ్రూప్‌కు ఇప్పటికే ఎయిర్‌ఏషియాలో 84 శాతం వాటాలు, విస్తారాలో 51 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి అదనంగా ఎయిరిండియాలోనూ 100 శాతం వాటాలను సొంతం చేసుకోవడం విశేషం.

భారత సంస్థ టాటా గ్రూప్..ఎయిరిండియాను దక్కించుకోవడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

Also Read..

Air India Sale: ఎయిరిండియాను హస్తగతం చేసుకున్న టాటా గ్రూప్‌.. సంతోషం వ్యక్తం చేస్తున్న ఇండియన్‌ నెటిజన్లు.

Samantha: ‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ

Air India privatisation: టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా.. ఎంతకు దక్కించుకున్నారో తెలుసా..?