Samantha: ‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ

సమంత మనోవేదన చెందుతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె బాధ పడుతుందా అంటే తాజా పరిణామాలు అవునని స్పష్టం చేస్తున్నాయి.

Samantha:  'కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి'.. సమంత భావోద్వేగ లేఖ
Samantha


సమంత మనోవేదన చెందుతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె బాధ పడుతుందా అంటే తాజా పరిణామాలు అవునని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి నాగచైతన్య, సమంతల విడాకులపై ఫ్యామిలీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. రకరకాల రూమర్స్ వచ్చాయి. తాజాగా సమంత మనోవేదనతో కూడిన లెటర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో కంటెంట్ ఇలా ఉంది.  నా వ్యక్తిగత సమస్య మీద మీరందరూ చూపిన ఎమోషన్స్‌కి థ్యాంక్స్, నా మీద చూపిన జాలి, దయకు కృతజ్ఞతలు. నా మీద వచ్చిన రూమర్స్‌ నుంచి నన్ను కాపాడటానికి ప్రయత్నించిన వారికి కృతజ్ఞతలు, నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని కనకూడదనుకున్నానని, నేను అవకాశవాదినని, నాకు అబార్షన్లు అయ్యాయని చాలా కథనాలు వచ్చాయంటూ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. చైతూతో డివోర్స్‌పై ట్విట్టర్‌లో వివరణ ఇచ్చింది సమంత. విడిపోవడం అనేదే ఒక తీవ్రమైన బాధతో కూడినది, నా వ్యక్తిత్వంపై జరుగుతున్న ఈ దాడి చాలా దారుణమైనది, కనికరం లేనిది. కానీ.. మీరనుకునే విధంగా నేనెప్పుడూ చేయను. ఇది నా ప్రామిస్.. ఈ కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి అంటూ ఆవేదనతో కూడిన లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సామ్-చెయ్ దంపతులు విడాకులు తీసుకున్నారు. దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ వేసి.. ఫ్రెండ్స్‌గా కొనసాగతామని ఇరువురూ స్పష్టం చేశారు. మనసులో కాస్త బాధ ఉన్నప్పటికీ.. విడిగానే తన జీవితాలు సాఫీగా సాగుతాయని వారు డిసైడయ్యారు. ఎవరి జీవితంలోనైనా డిస్టబెన్సెస్ సహజం. అయితే సమంత మనసులో ఇప్పుడు ఎంతో కొంత బాధలో ఉంది. ఆ బాధకు మెడిసిన్ ఆమె తీరిక లేకుండా సినిమాల్లో నటించడం. అందుకు తగ్గట్టుగానే 5 సంవత్సరాల వరకు సామ్ డేట్స్ ఫిల్ అయిపోయాయి. అయితే ఇక్కడ అభిమానుల బాధ ఒక్కటే. ఆమె ఇప్పుడు పరిణితి చెందిన పాత్రలు మాత్రమే వేస్తున్నారు. తొలి నాళ్లలో చేసిన పక్కింటమ్మాయి, కాలేజ్ గర్ల్ పాత్రలకు దూరంగా ఉంటున్నారు. సమంత కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో యూత్ ఆమెను ఎంతో లైక్ చేసేవారు. ఇప్పుడు బరువైన పాత్రలు ఎక్కువగా పోషిస్తున్నారు. అందుకే తమను అలరించే అప్పటి పాత్రలు మళ్లీ పోషించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Also Read: యాదగిరిగుట్టలో పిల్లి మిస్సింగ్‌ కేసు.. పిల్లలు అన్నం తినడం లేదని ఆవేదన

నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu