Konda Polam Movie Review: ఓ పర్పస్‌ ఉందని నమ్మేవారి కోసం… కొండ పొలం!

Konda Polam Movie Review: మేకర్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది. తమకంటూ ఓన్‌ స్పేస్‌ ఉంటుంది. గమ్యం, వేదం, కంచె తరహాల సినిమాలను తీసిన దర్శకుడు క్రిష్‌..

Konda Polam Movie Review: ఓ పర్పస్‌ ఉందని నమ్మేవారి కోసం... కొండ పొలం!
Konda Polam Movie Review
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 08, 2021 | 3:11 PM

Konda Polam Movie Review: మేకర్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది. తమకంటూ ఓన్‌ స్పేస్‌ ఉంటుంది. గమ్యం, వేదం, కంచె తరహాల సినిమాలను తీసిన దర్శకుడు క్రిష్‌.. అలాంటి ఓన్‌ స్టైల్‌లో సొంత స్పేస్‌లో చేసిన మరో సినిమా కొండ పొలం. అతి తక్కువ పాత్రలతో, క్రిష్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఉప్పెన తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ చేసిన కొండపొలం ప్రేక్షకులను మెప్పిస్తుందా? గొర్రెల కాపరి ఓబులమ్మ కేరక్టర్‌లో రకుల్‌ ఒదిగిపోగలిగారా? చదివేయండి.

సినిమా: కొండపొలం సంస్థ: ఫస్ట్ ఫ్రమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ నటీనటులు: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి, ఆంటోని, రవిప్రకాష్‌, మహేష్‌ విట్ట తదితరులు నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి కెమెరా: జ్ఞానశేఖర్‌ సంగీతం: ఎం ఎం కీరవాణి స్క్రీన్‌ప్లే : దర్శకత్వం: క్రిష్‌ విడుదల: 8.10.2021

రవీంద్రనాథ్‌ (పంజా వైష్ణవ్‌) నల్లమల ప్రాంతంలోని మారుమూల పల్లెటూరికి చెందిన వ్యక్తి. తమకున్న గొర్రెల మందలో సగం అమ్మి బీటెక్‌ చదివిస్తాడు అతని తండ్రి (సాయిచంద్‌). నాలుగేళ్లు హైదరాబాద్‌లో ఎన్ని కంపెనీలు తిరిగినా రవీంద్రకి ఉద్యోగం రాదు. దాంతో ఒకసారి ఇంటికెళ్తాడు. అప్పుడు తాత (కోట శ్రీనివాసరావు) సలహా మేరకు తండ్రితో పాటు కొండపొలం వెళ్తాడు. ఆ తండ్రీకొడుకులతో పాటు మరికొందరు కూడా కొండపొలానికి వెళ్తారు. అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలేంటి? వాటి నుంచి ఏం తెలుసుకున్నారు? కొండపొలం చేసొచ్చాక రవీంద్రలో కనిపించిన మార్పులేంటి? రవీంద్రనాథ్ జీవితంలో ఓబులమ్మకున్న ఇంపార్టెన్స్ ఏంటి? వంటివి ఆసక్తికరమైన అంశాలు.

కోటి కలలతో సిటీకి వచ్చే చాలా మంది యువతలో లేనిది నైపుణ్యం కాదు… ఆత్మవిశ్వాసం! ఎదుటివాళ్లకు అంతా తెలుసు, మనకేం తెలియదనే అపనమ్మకం, దాంతో తెలిసిన విద్యను కూడా తెలివిగా, ధైర్యంగా వ్యక్తం చేయలేకపోతారు. అవకాశాలను జారవిడుచుకుంటుంటారు. మనవాళ్లకు తగిన గైడెన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు అనే మంచి పాయింట్‌ ఉన్న కథ కొండ పొలం.

Konda polam

Konda polam

చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే సరిపోదు, గమనించాలి. మనిషిలో తెగువ కావాలి.. అది ఎలా ఉండాలంటే పొట్టేలు తలపడినంత తెగువతో ఉండాలి. చావో రేవో తేల్చుకోగలిగిన ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అన్నీ మన దగ్గరకు వచ్చి తీరుతాయి. ఉన్నవీ లేనివీ ఆలోచించుకుని భయపడకూడదు. అక్కర్లేని విషయాలను పట్టించుకోకూడదు. అవసరం ఉన్న చోట వెనకడుగు అస్సలు వేయకూడదు. బంధాలు, బంధుత్వాలు మన భావోద్వేగాలను బలపరుస్తాయి.

కటారు రవీంద్రనాథ్‌గా వైష్ణవ్‌తేజ్‌ చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఓబులమ్మ కేరక్టర్‌కి రకుల్‌ ఎంతమాత్రం సూట్‌ అవుతారనేది సినిమా స్టార్టింగ్‌లో చాలా మందికున్న డౌట్‌. అయితే ఒన్స్ స్క్రీన్‌ మీద ఆమెను చూశాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయిపోతాయి. అడవుల్లో చాలా ఈజ్ తో ట్రావెల్ చేస్తూ నేటివిటీని పండించారు రకుల్‌. రచ్చరవి, హేమ, రవిప్రకాష్‌, క్రిష్‌ ఇలా మిగిలిన వాళ్లు కూడా తమతమ కేరక్టర్లకు న్యాయం చేసిన వాళ్లే. రాయలసీమ యాసను కావాలని వాడినట్టు ఎక్కడా అనిపించదు. చాలా బాగా డబ్బింగ్‌ చెప్పించారు.

చాన్నాళ్ల తర్వాత కోట శ్రీనివాసరావుకు మంచి కేరక్టర్‌ పడింది. రవీంద్రనాథ్‌ తాతగా ఆయన చెప్పే ప్రతి మాటా స్క్రీన్‌ మీద హీరోనే కాదు, థియేటర్లో ఆడియన్స్ ని కూడా ఆలోచింపజేస్తుంది. అందులోనూ అంత పెద్ద మనిషి మనసారా చెప్పిన మాటలను ఫాలో కావాలనే ఫీల్‌ కూడా వస్తుంది. సాయిచంద్‌ తండ్రి కేరక్టర్‌ని అద్భుతంగా పండించారు. ఫిదాలో తెలంగాణ యాసతో మెప్పించిన ఆయన, ఈ సారి రాయలసీమ యాక్సెంట్‌ని బాగా ఓన్‌ చేసుకున్నారు.

చేతికి ఎదిగొచ్చిన కొడుకు ఉద్యోగం రాకుండా ఇంటికి వస్తే తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుంది? ధైర్యంగా ముందుకు సాగాల్సిన మగపిల్లాడు భయంభయంగా ఉంటే, దాన్ని చూసి నలుగురూ నవ్వుతుంటే ఆ తండ్రి మానసికంగా ఎలా నలిగిపోతాడు? కొడుకు ఆపదలో ఉన్నప్పుడు ఎలా విలవిలలాడిపోతాడు? అదే పిల్లాడు ఒకమ్మాయితో చనువుగా ఉండటం చూసినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు…? ఇలాంటివాటిని తెరపై అద్భుతంగా పండించారు సాయిచంద్‌.

Kondapolam

Konda polam

రవిప్రకాష్‌ కేరక్టర్‌కి కనెక్టయ్యేవారు కూడా చాలా మందే ఉంటారు. కోరుకున్న పిల్ల ఇష్టప్రకారం నడుచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అన్నీ సందర్భాల్లోనూ అది వీలుపడకపోవచ్చు. విందులు, వేడుకల కన్నా కంటిముందున్న కర్తవ్యాన్ని చేయడానికే మొగ్గుచూపించాల్సి రావచ్చు. అలాంటప్పుడు అలకలూ, కోపాలూ తప్పవు. వాటిని పెద్దవి చేసి చూసుకుంటే జీవితాలు నిలబడవు. కట్టుకున్న వాళ్లతో కడుపారా మాట్లాడుకున్నప్పుడే కల్మషం లేని కాపురాలు నిలబడుతాయని సింబాలిక్‌గా చెప్పడం బావుంది.

అంతే కాదు, ఓబులమ్మ కేరక్టర్‌ని కూడా చాలా బాగా డిజైన్‌ చేశారు. భార్యంటే భర్త కాళ్లకి బంధనం కాకూడదు. చేయి పట్టుకుని నడిపించే తోడవ్వాలి. ఈ సినిమాలో రవీంద్రనాథ్‌కి తోడుగా ఓబులమ్మ నిలుచున్నట్టు. ఓబులమ్మ పిన్నిగా చేసిన హేమ, రవీంద్ర బామ్మగా చేసిన అన్నపూర్ణమ్మ… ప్రతి పాత్రా తమ పరిధిలో స్క్రీన్‌ మీద సందడి చేశాయి.

కేరక్టర్లను రాసుకున్న తీరు మాత్రమే కాదు, సన్నివేశాలను కూడా చాలా సహజంగా అల్లుకున్నారు క్రిష్‌. ఎర్ర చందనం చెట్లను కొట్టే విషయాన్ని కూడా అందంగా కథలో చొప్పించారు. క్రిష్‌ చెప్పాలనుకున్న విషయానికి కీరవాణి ఆర్‌ ఆర్‌ ప్రాణం పోసింది. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. రాత్రిపూట తీసిన సీన్లు, ఎర్లీ మార్నింగ్‌ షాట్స్ స్క్రీన్‌ మీద ఫ్రెష్‌ ఫీల్‌ కలిగించాయి. డైలాగులు కథకి స్పెషల్‌ అసెట్‌.

ఇప్పుడిప్పుడే జీవితాల్లో స్థిరపడాలనుకునేవారు, చిన్న చిన్న వాటికే భయపడేవారు, ఆత్మస్థైర్యం గురించి ఆలోచించేవాళ్లు… ఓవరాల్‌గా యూత్‌ చూడాల్సిన సినిమా. ఇందులో ఏ ఒక్క మాట కనెక్టయి జనాలు ఇన్‌స్పయిర్‌ అయినా డైరక్టర్‌ పర్పస్‌ నెరవేరినట్టే. నవలలు స్క్రీన్‌ మీదకు రావడం అరుదైపోయిన ఈ రోజుల్లో సన్నపురెడ్డి నవలను స్క్రీన్‌ మీద చక్కగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు క్రిష్‌.

ఒక్కమాటలో చెప్పాలంటే… కొండపొలం… జీవితాన్ని సరికొత్తగా పరిచయం చేస్తుంది.

-డా. చల్లా భాగ్యలక్ష్మి, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

Poonam Kaur: నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ

Varudu Kaavalenu : దసరా రేస్ నుంచి తప్పుకున్న నాగశౌర్య.. వెనక్కితగ్గిన ‘వరుడు కావలెను’..?

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!