Rajasthan: భార్య సంపాదిస్తున్నప్పటికీ భరణం పొందేందుకు ఆమెకు హక్కు ఉంది.. రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు
పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారతాయి. కొన్నిసార్లు వివాదాస్పదంగా, మరికొన్ని సార్లు సానుకూలంగా మారతాయి. కేరళ హైకోర్టు(Kerala High Court), బాంబే హైకోర్టు ఎన్నో విచిత్రమైన....

పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారతాయి. కొన్నిసార్లు వివాదాస్పదంగా, మరికొన్ని సార్లు సానుకూలంగా మారతాయి. కేరళ హైకోర్టు(Kerala High Court), బాంబే హైకోర్టు ఎన్నో విచిత్రమైన తీర్పులు ఇచ్చి వార్తల్లోకెక్కాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. భర్త క్రూరత్వాన్ని తట్టుకోలేక భార్య వెళ్లిపోతే.. శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు పరిగణించలేమని రాజస్థాన్ హై కోర్టు(Rajasthan High Court) కీలక తీర్పు ఇచ్చింది. ఓ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నారు. ఆయనకు అతని భార్యలో ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో ఆమె విడాకులు కావాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అంతే కాకుండా భర్త నుంచి భరణం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా.. దీనిపై భర్త కూడా పిటిషన్ దాఖలు చేశాడు. ఆమె తనతో కలిసి ఉండటం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. నెలవారీ భరణం ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై ఆ దంపతులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు.. హైదరాబాద్‌లోని జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇచ్చింది. భార్య, కుమారుడికి భర్త చెల్లించే నెలవారీ భరణాన్ని పెంచాలని సూచించింది. భార్య సంపాదిస్తున్నప్పటికీ, భర్త నుంచి అవసరమైన భరణాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఆమెకు హక్కు ఉందని స్పష్టం చేసింది.







