AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పూజల పేరుతో కన్నకూతురిపై తండ్రి కర్కశత్వం.. నోటి నిండా కుంకుమ కుక్కి దారుణం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లో ఏదో ఒక చోట మూఢ నమ్మకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ....

Andhra Pradesh: పూజల పేరుతో కన్నకూతురిపై తండ్రి కర్కశత్వం.. నోటి నిండా కుంకుమ కుక్కి దారుణం
Atmakuru
Ganesh Mudavath
|

Updated on: Jun 15, 2022 | 7:06 PM

Share

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లో ఏదో ఒక చోట మూఢ నమ్మకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వేళ్లూనుకుపోయింది. దాడులు చేయడం, అమానుష ఘటనలకు పాల్పడడం, ఊరి నుంచి వెలేయడం వంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. కారణం ఏదైనప్పటికీ.. వీటి ఉనికి ప్రమాదకరంగా మారుతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. పూజల పేరుతో ఓ తండ్రి తన కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్‌ తన కుమార్తెతో కలిసి ఇంట్లో పూజలు చేశాడు. పూజలు చేస్తున్న సమంయలో చిన్నారిని పూజగదిలో పడుకోబెట్టి నోటి నిండా కుంకుమ పోశాడు. ఏం జరుగుతుందో తెలియక.. బాలిక భయంతో అరిచింది. అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా గొంతును గట్టిగా నొక్కాడు. బాలిక అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చారు.

వెంటనే అప్రమత్తమై చిన్నారిని చికిత్స కోసం ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్ర భయాందోళనకు గురైన బాలిక అప్పటికే అపస్మారక స్థితికి చేరుకుంది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లారు. కాగా.. కొన్ని రోజులుగా వేణుగోపాల్‌ మానసిక పరిస్థితి బాగా లేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేణు గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంత అందానికి అదృష్టమే కలిసి రావట్లేదు.. హిట్టు కోసం వెయిటింగ్..
ఇంత అందానికి అదృష్టమే కలిసి రావట్లేదు.. హిట్టు కోసం వెయిటింగ్..
పాము కరిచినా చావదు.. సింహనికే సుస్సుపోయించే భయపడని జంతువు..
పాము కరిచినా చావదు.. సింహనికే సుస్సుపోయించే భయపడని జంతువు..
వారం రోజులు జీలకర్ర నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు..
వారం రోజులు జీలకర్ర నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు..
IND vs PAK: టీమిండియాతో మ్యాచ్‌కు ఓకే చెప్పిన పాక్..?
IND vs PAK: టీమిండియాతో మ్యాచ్‌కు ఓకే చెప్పిన పాక్..?
ప్రతి రోజు ఉదయాన్నే నానబెట్టిన శనగలు తింటే.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతి రోజు ఉదయాన్నే నానబెట్టిన శనగలు తింటే.. శరీరంలో జరిగేది ఇదే!
సెలెక్టర్లు ఛీ కొట్టారు.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో షమీ ఊచకోత
సెలెక్టర్లు ఛీ కొట్టారు.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో షమీ ఊచకోత
'బరాబర్ ప్రేమిస్తే' మూవీ విలన్‌ను గుర్తు పట్టారా? అప్పుడు హీరోగా.
'బరాబర్ ప్రేమిస్తే' మూవీ విలన్‌ను గుర్తు పట్టారా? అప్పుడు హీరోగా.
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే బండి స్టైల్ ఆలూ కుర్మా రెసిపీ
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే బండి స్టైల్ ఆలూ కుర్మా రెసిపీ
రైల్వే ప్రయాణికులకు బిగ్ న్యూస్.. ఆర్డర్ చేస్తే సీటు వద్దకే ఫుడ్
రైల్వే ప్రయాణికులకు బిగ్ న్యూస్.. ఆర్డర్ చేస్తే సీటు వద్దకే ఫుడ్
రూ. 10 వేల పెట్టుబడితో రూ. 2.5 లక్షల ఆదాయం..
రూ. 10 వేల పెట్టుబడితో రూ. 2.5 లక్షల ఆదాయం..