AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: మూడో రోజు ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈడీ విచారణ మూడో రోజు ముగిసింది. ఎల్లుండి మరోసారి విచారణకు రావాలన్న ఈడీ అధికారులు తెలిపారు. ఇవాళ రాహుల్ గాంధీని 9 గంటలపాటు విచారించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ

Rahul Gandhi: మూడో రోజు ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
National Herald Case Rahul Gandhi
Ganesh Mudavath
| Edited By: Team Veegam|

Updated on: Jun 17, 2022 | 1:34 PM

Share

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈడీ విచారణ మూడో రోజు ముగిసింది. ఎల్లుండి మరోసారి విచారణకు రావాలన్న ఈడీ అధికారులు తెలిపారు. ఇవాళ రాహుల్ గాంధీని 9 గంటలపాటు విచారించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఎదుట మూడో రోజు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఆయన వెంట ఆయన సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. విచారణ కారణంగా పోలీసులు ఢిల్లీలో(Delhi) ఆంక్షలు విధించారు. ఈడీ విచారణ రెండో రోజు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, రైతులు, యువకులు, కార్మికుల హక్కుల కోసం గొంతు ఎత్తినందుకే పార్టీ మాజీ అధ్యక్షుడితో ప్రభుత్వానికి ఇబ్బంది ఉందని పేర్కొంది.

చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఉదయం 11.30 గంటలకు ప్రశ్నించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు గంటల విచారణ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ బయటకు వచ్చి గంట తర్వాత మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు.. నిన్నటితోనే ముగించాలని రాహుల్ ఈడీ అధికారులను కోరినట్టు తెలుస్తోంది. అందుకు అంగీకరించని అధికారులు బుధవారం తప్పనిసరిగా అటెండ్ కావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో ఈడీ ఎదుట హాజరుకాక తప్పలేదు.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం