AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Elections: హర్యానాలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. రాహుల్ , రాజ్‌నాథ్ సింగ్‌ మాటల తూటాలు

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. యమునానగర్‌ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ , అంబానీలకే కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. తాము అధికారం లోకి వస్తే దేశసంపదను పేదలు , దళితులకు పంచుతామని అన్నారు

Haryana Elections: హర్యానాలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. రాహుల్ , రాజ్‌నాథ్ సింగ్‌ మాటల తూటాలు
Rajnath Singh, Rahul Gandhi
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2024 | 9:56 PM

Share

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. యమునానగర్‌ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ , అంబానీలకే కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. తాము అధికారం లోకి వస్తే దేశసంపదను పేదలు , దళితులకు పంచుతామని అన్నారు . నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. పెన్షన్లను రద్దు చేయడానికే కేంద్రం అగ్నివీర్‌ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు రాహుల్‌గాంధీ.. ప్రియాంకతో కలిసి ఆయన అంబాలాలో కూడా రోడ్‌షో నిర్వహించారు. ‘అదానీ , అంబానీలకు మోదీ ఎంత డబ్బు ఇచ్చాడో నేను దేశం లోని పేదలు , దళితులు , ఓబీసీలకు కూడా అంత డబ్బు ఇస్తా.. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తాం.. రుణమాఫీ చేస్తాం.. మీ జేబులో నుంచి ఇప్పుడు ఎంత పోతుందో ఆ డబ్బులు తిరిగిస్తాం.. లోక్‌సభ ఎన్నికల వేళ మహిళలకు లక్ష సాయం చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

హర్యానా ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీని గద్దె దింపే వరకు తనకు చావురాదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ . ఖర్గే 125 ఏళ్లు బతకాలని తాను కోరుకుంటునట్టు చెప్పారు. ఖర్గే 125 ఏళ్లు బతికితే మోదీ కూడా 125 ఏళ్లు అధికారంలో ఉంటారని సెటైర్‌ వేశారు. హర్యానాలో కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే హిమాచల్‌ లాంటి పరిస్థితి వస్తుందన్నారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ‘ హిమాచల్‌ప్రదేశ్‌ పక్కనే ఉంటుంది.. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. జీతాల కోసం ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. హిమాచల్‌ సర్కార్‌ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు’ అంటూ మండి పడ్డారు రాజ్ నాథ్ సింగ్. అక్టోబర్‌ 5వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..