‘నెలసరి’ సెలవులకూ శాలరీ.. ఐరాస్‌లో భారత మహిళ డిమాండ్‌

‘నెలసరి’ సెలవులకూ శాలరీ.. ఐరాస్‌లో భారత మహిళ డిమాండ్‌

Phani CH

|

Updated on: Sep 30, 2024 | 9:45 PM

నెలసరి లేదా పీరియడ్‌ సమయంలో మహిళలు అనుభవించే బాధ, వేదనవారికే మాత్రమే తెలుసు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్‌ పెయిడ్‌ లీవ్‌. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని ఐక్యరాజ్యసమితి సమావేశంలో గళమెత్తారు.

నెలసరి లేదా పీరియడ్‌ సమయంలో మహిళలు అనుభవించే బాధ, వేదనవారికే మాత్రమే తెలుసు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్‌ పెయిడ్‌ లీవ్‌. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని ఐక్యరాజ్యసమితి సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైనా అనుభవం నుంచే ఆలోచన వచ్చి నట్టు ప్రియదర్శిని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విసుగుకి.. విడాకులకు ఏంటి సంబంధం ??

రుతుక్రమం సక్రమంగా రావట్లేదా ?? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి.. అన్నీ సెట్‌ !!

మీటరు మారుస్తారా.. డబుల్‌ బిల్లు కడతారా ??

సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??