విసుగుకి.. విడాకులకు ఏంటి సంబంధం ??

యువతీయువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందడమే విడాకులకు కారణమని సింగర్ ఆశా భోంస్లే అన్నారు. రోజురోజుకు విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరగడంపై ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో ఆమె ఓ చర్చలో పాల్గొని విడాకుల గురించి మాట్లాడారు. తన భర్తపై కోపం వచ్చినప్పుడు తన అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఉండి వచ్చేదాన్ననీ అంతేకానీ, విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని ఆశాభోంస్లే అన్నారు.

విసుగుకి.. విడాకులకు ఏంటి సంబంధం ??

|

Updated on: Sep 30, 2024 | 9:43 PM

యువతీయువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందడమే విడాకులకు కారణమని సింగర్ ఆశా భోంస్లే అన్నారు. రోజురోజుకు విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరగడంపై ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో ఆమె ఓ చర్చలో పాల్గొని విడాకుల గురించి మాట్లాడారు. తన భర్తపై కోపం వచ్చినప్పుడు తన అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఉండి వచ్చేదాన్ననీ అంతేకానీ, విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని ఆశాభోంస్లే అన్నారు. ఈ రోజుల్లో ప్రతినెలా విడాకులు తీసుకొనేవారి సంఖ్య పెరుగుతోందనీ ఇలా ఎందుకు జరుగుతుందని ఆమె రవిశంకర్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెబుతూ.. దేవుడిపై నమ్మకం ఉండి కష్టాలను తట్టుకునే శక్తి మీకు ఉందని కానీ నేటితరానికి సహనం తగ్గిపోయిందని అన్నారు. అందుకు ఆశా భోంస్లే తాను సినిమా పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నట్లు తన కెరీర్‌లో ఎంతోమందిని చూసినట్లు చెప్పారు. ప్రస్తుత తరంతో పోలిస్తే గతంలో వారు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదనీ అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రుతుక్రమం సక్రమంగా రావట్లేదా ?? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి.. అన్నీ సెట్‌ !!

మీటరు మారుస్తారా.. డబుల్‌ బిల్లు కడతారా ??

సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??

నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పైన ముద్దుల వర్షం

Follow us