ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??
నదులు, కాలువల్లో ఉండాల్సిన చేపలు రోడ్డు మీద ప్రత్యక్షమైతే.. మాంసప్రియులకు పండగే పండగ.. ఇక వందల ఖరీదు చేసే చేపలు ఫ్రీగా దొరికితే జాతరే.. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు.
నదులు, కాలువల్లో ఉండాల్సిన చేపలు రోడ్డు మీద ప్రత్యక్షమైతే.. మాంసప్రియులకు పండగే పండగ.. ఇక వందల ఖరీదు చేసే చేపలు ఫ్రీగా దొరికితే జాతరే.. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో లైవ్ ఫిష్ కోసం స్థానిక ప్రజలు ఎగబడ్డారు. నదుల్లో ఉండాల్సిన చేపలు నడిరోడ్డుమీద కళ్లెదుట నాట్యం చేస్తుంటే వాటిని చూసిన జనం ఏరుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేశారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

