తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే. ఎగిరి గంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్‌ నెలలో విద్యార్థులు చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ రాబోతోంది. సో.. దసరా సెలవులు పేరు చెప్పగానే.. స్టూడెంట్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే సెలవుల్లో కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ

|

Updated on: Sep 30, 2024 | 5:49 PM

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే. ఎగిరి గంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్‌ నెలలో విద్యార్థులు చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ రాబోతోంది. సో.. దసరా సెలవులు పేరు చెప్పగానే.. స్టూడెంట్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే సెలవుల్లో కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తెలంగాణలోని విద్యాసంస్థలకు ఈ దసరా పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలవుతాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయంది విద్యాశాఖ. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15న పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. సెలవులు రాగానే ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్

TOP 9 ET News: ఇది ఆల్ టైం రికార్డ్‌ !! జయహో దేవర

Follow us