మీటరు మారుస్తారా.. డబుల్‌ బిల్లు కడతారా ??

మీటరు మారుస్తారా.. డబుల్‌ బిల్లు కడతారా ??

Phani CH

|

Updated on: Sep 30, 2024 | 9:41 PM

తెలంగాణలో గ్రేటర్‌ వాసులకు జలమండలి షాకిచ్చింది. నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబుల్‌ బిల్లు పే చేయాలని, అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతు అవ్వడమే కాకుండా...రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. గతంలో గ్రేటర్‌ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్‌ మీటర్లను జలమండలి అమర్చింది.

తెలంగాణలో గ్రేటర్‌ వాసులకు జలమండలి షాకిచ్చింది. నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబుల్‌ బిల్లు పే చేయాలని, అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతు అవ్వడమే కాకుండా…రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. గతంలో గ్రేటర్‌ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్‌ మీటర్లను జలమండలి అమర్చింది. ఒక్కో మీటరుకు రూ.30 వేల నుంచి లక్షపైనే వసూలు చేసింది. కొన్ని కంపెనీల మీటర్లు నాణత్య లోపం వల్ల మూలకు చేరాయి. చాలా వరకు కొత్తవి అమర్చలేదు. ఉచిత నీటి పథకం అమలు కావడంతో చాలామంది అదనంగా వాడిన నీటి బిల్లులు సైతం చెల్లించడం లేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కొత్తవి పెట్టుకోవాలని, లేదంటే ఉచిత స్కీం నిలుపుదలతోపాటు రెండింతల బిల్లులు చెల్లించాలని నోటీసులో ఆదేశించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??

నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పైన ముద్దుల వర్షం

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ