అమరేందర్ సింగ్ , నవజ్యోత్ సింగ్ సిద్దు మధ్య మళ్ళీ కయ్యం..సోనియాగాంధీతో భేటీ కానున్న పంజాబ్ సీఎం
పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ , రాష్ట్ర కొత్త కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయి. గత నెలలో తాను పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ గా చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సిద్దు కోరడం, దానికి అమరేందర్ సింగ్ హాజరు కావడం
పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ , రాష్ట్ర కొత్త కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయి. గత నెలలో తాను పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ గా చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సిద్దు కోరడం, దానికి అమరేందర్ సింగ్ హాజరు కావడం చూసి ఇక ఇద్దరి మధ్యా వైషమ్యాలు తొలగిపోయినట్టేనని అంతా భావించారు. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడిందని వార్తలు వచ్చాయి. కానీ పరిస్థితి ఏమీ మారలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. 2018 నాటి డ్రగ్ ట్రాఫికింగ్ కేసుతో ప్రమేయమున్న శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ మజీతియా..మరికొందరిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్య తీసుకోలేదని సిద్దు ఆరోపిస్తున్నారు. ఇంకా ఆలస్యమైతే ఈ అంశంపై విధాన సభలో తాము ఓ తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 18 అంశాల అజెండా కింద ఇలాంటి నేరస్థులపై చర్య తీసుకోవలసి ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ కేసు రిపోర్టులను బహిర్గతం చేయాలని కూడా సిద్దు డిమాండ్ చేశారు.
అయితే దీనిపై అమరేందర్ సింగ్ ప్రభుత్వం స్పందించలేదు. ఆయన తన మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చారని చెబుతున్నా.. సిద్దు వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికే వచ్చారని అంటున్నారు. అటు అమృత్ సర్ లోని ఓ గ్రామం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న ఓ టిఫిన్ బాక్స్ బాంబు విషయాన్ని కూడా అమరేందర్ సింగ్ హోం మంత్రి అమిత్ షాతో తాను జరిపే భేటీలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.