AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రాళ్లు జాగ్రత్త.. పెళ్లి సంబంధం మాట్లాడుదామని పిలిచారు.. కట్‌చేస్తే.. తిరిగిరాని లోకాలకు పంపారు!

తమ కూతురిని ప్రేమించాడే కారణంతో ఒక కుటుంబం దారుణానికి పాల్పడింది. పెళ్లి సంబంధం మాట్లాడుదామని కూతురి ప్రియుడని ఇంటికి పిలిచిన యువతి కుటుంబ సభ్యులు.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి చంపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె నగరంలోవెలుగు చూచింది.

కుర్రాళ్లు జాగ్రత్త.. పెళ్లి సంబంధం మాట్లాడుదామని పిలిచారు.. కట్‌చేస్తే.. తిరిగిరాని లోకాలకు పంపారు!
Crime
Anand T
|

Updated on: Aug 31, 2025 | 1:14 PM

Share

ప్రస్తుత రోజుల్లో ప్రేమ మరణాలు పెరిగిపోతున్నాయి. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కొన్ని జంటలు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు పిల్లల ప్రేమను జీర్ణించనుకోలేని కొందరు పెద్దవాళ్లే.. యువతినో, యువకుడినో హత్యలు చేయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణె ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తమ కూతురిని ప్రేమించాడే కారణంతో ఒక కుటుంబం దారుణానికి పాల్పడింది. పెళ్లి సంబంధం మాట్లాడుదామని కూతురి ప్రియుడని ఇంటికి పిలిపించి.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేసింది యువతి కుటుంబం. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పూణెలోని పింప్రి చించ్వాడ్ లోని సాంఘ్వి ఏరియాకు చెందిన ఓ యువతి స్థానికంగా నివాసం ఉంటున్న రమేశ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. కూతురి ప్రేమాయణం గురించి తెలసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తన ప్రేమకు నిరాకరించారు. యువకుడిపై లేనిపోని ఆరోపణలు మోపి అతడి నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. అయినా కూతురు అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడంతో చేసేదేమిలేక పెళ్లికి అంగీకరించారు. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు యువకుడిని ఇంటికి రమ్మని ఆమెకు చెప్పి రమేశ్‌ను ఇంటికి పిలిపించారు.

దీంతో యువతి ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా రమేశ్‌కు తెలిపింది. ఇక వెంటనే రమేష్‌ తన తల్లిదండ్రులతో కలిసి యువతి ఇంటికి చేరుకున్నాడు. అయితే అక్కడి వచ్చిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు మాట మార్చారు. ప్రేమ పేరుతో తమ కూతురిని వలలో వేసుకున్నావని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈక్రమంలో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు రమేశ్‌ను రూమ్‌లోకి లాక్కెళ్లి చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయడిన రమేశ్‌ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు.

అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందతూ రమేశ్ మరణించాడు. రమేశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కుటుంబ సభ్యులు 9 మందిని అరెస్టు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది.