చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు

చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు మిన్నంటాయి. చైనా-పాక్‌ ఆర్ధిక కారిడార్‌లో నీలం-జీలం నదులపై జల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌..

చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 10:08 PM

చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు మిన్నంటాయి. చైనా-పాక్‌ ఆర్ధిక కారిడార్‌లో నీలం-జీలం నదులపై జల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం.. పాక్‌ చైనాతో జూన్‌ మాసంలో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో చైనాకు చెందిన కంపెనీలు ఈ నదులపై భారీ డ్యాములను నిర్మించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టులను నిరసిస్తూ.. పీవోకేలోని ముజఫరాబాద్‌లోని ప్రజలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నదిని కాపాడుకుందా.. ముజఫరాబాద్‌ను కూడా కాపాడుకుందాం అంటూ స్లోగన్స్‌ ఇస్తూ ఈ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో చైనా దేశపు జాతీయ జెండాలను తగులపెట్టారు.