పంబన్‌ బ్రిడ్జ్‌ వద్ద తనఖీలు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్ వేళ.. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. తాజాగా తమిళనాడులోని రామేశ్వరంలోని పంబన్‌ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్స్‌పై సెక్యూరిటీ..

పంబన్‌ బ్రిడ్జ్‌ వద్ద తనఖీలు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 8:42 PM

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్ వేళ.. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. తాజాగా తమిళనాడులోని రామేశ్వరంలోని పంబన్‌ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్స్‌పై సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టాయి. రైల్వే ట్రాక్స్‌లన్నింటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సమీప ప్రాతంలో సెక్యూరిటీని మోహరించారు. సముద్ర ప్రాంతం కావడంతో.. ఉగ్రవాదులు ఈ ప్రాంతం గుండా కూడా ప్రవేశించే అవకాశం ఉండంటంతో.. తీర ప్రాంత గస్తీ దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.

కాగా, అటు జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో కూడా ఆర్మీ తనిఖీలను ముమ్మరం చేసింది. చెనాబ్ నదిలో బీఎస్ఎఫ్ లేటెస్ట్ పడవలపై పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నాయి. అటు పుల్వామా జిల్లాలో గురువారం నాడు రెండు ఉగ్రస్థావరాలు బయటపడ్డ సంగతి తెలిసిందే.