GHMC కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం.. అధికారం కైవసం చేసుకునేందుకు సూచనలు
తెలంగాణలో(Telangana) అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ...
తెలంగాణలో(Telangana) అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కార్పొరేటర్లతో ప్రధాని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటారని కార్పొరేటర్లను మెచ్చుకున్న ప్రధాని.. రానున్న ఎన్నికల్లో మరింత చురుగ్గా పని చేయాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని, హైదరాబాద్‌లో(Hyderabad) బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే దేశ ప్రధాని కార్పొరేటర్లతో సమావేశం కావడం, వారికి పరిపాలన అంశాలపై సూచనలివ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది.
Met @BJP4Telangana corporators in GHMC and other Party leaders from Telangana. We had wide-ranging discussions on how to focus on community service endeavours and help people at the grassroots. BJP will work for good governance and ending dynastic misrule in Telangana. pic.twitter.com/y0Xt3sWz40
ఇవి కూడా చదవండి— Narendra Modi (@narendramodi) June 7, 2022
తెలంగాణలో ప్రజల మద్దతు బీజేపీకే ఎక్కువగా ఉందని కార్పొరేటర్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కష్టపడి పని చేస్తే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని ప్రధాని సూచించారు. కార్పొరేటర్లతో సమావేశం అయిన సందర్భంగా ప్రధాని వారితో గ్రూప్ ఫోటో దిగారు. మోదీ , జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ఫొటోను ప్రధాని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి