Viral Video: వామ్మో.. నాగుపాముతో కలిసి జీవిస్తున్న మహిళ.. కారణం తెలిస్తే ముచ్చెమటలు పట్టాల్సిందే.. వీడియో
శారవ్వ భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో.. అప్పటి నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఓ పాము ఇంట్లోకి వచ్చింది.
Snake Viral Video: సాధారణంగా పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. ఇంకా దగ్గరగా చూస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంది ఓ మహిళ.. చనిపోయిన భర్త పాము రూపంలో వచ్చాడంటూ.. ఓ పాము నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచుకుంటూ ఆలనాపాలనా చూసుకుంటోంది. అవును.. మీరు విన్నది నిజమే.. తాచు పామును ఇంట్లో బెడ్ మీద పెట్టుకుని మరీ పెంచుతోంది. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలోని కులహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా బనహట్టి తాలుకా కులహళ్లి గ్రామంలో శారవ్వ కంబార అనే మహిళ నివసిస్తోంది. శారవ్వ భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో.. అప్పటి నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఓ పాము ఇంట్లోకి వచ్చింది. అయితే.. తన భర్తే పాము రూపంలో వచ్చాడని, ఈ విషయం బయటి వాళ్లకు ఎవరికీ చెప్పకుండా గత కొద్ది రోజులు పామును పెంచుకుంటోంది. దీంతోపాటు దాని ఆలనా పాలనా చూసుకుంటూ దానికి ముచ్చట్లు సైతం చెబుతోంది.
అయితే ఓ రోజు శారవ్వ ఇంటికి వచ్చిన పక్కింటి మహిళ.. నల్లటి తాచు పామును చూసి షాక్ అయింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులుగా పాము తన వద్దే ఉందనీ, ఎవరినీ ఏమీ చేయదు.. చంపొద్దంటూ శారవ్వ వేడుకుంది. అయితే, చుట్టుపక్కలవారు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. వెంటనే అక్కడకికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు.. ఆ పామును సంచిలో బంధించి అడవిలో వదిలిపెట్టారు.
వీడియో..
ఆ మహిళ అదృష్టం ఏంటంటే.. నాలుగు రోజులుగా పెంచుకుంటున్న పాము ఆమెపై ఎలాంటి దాడి చేయలేదు. అయితే.. ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని.. ఒక్కొసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..