RBI Repo Rate Hike: రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన RBI.. ఖరీదుగా మారనున్న రుణాల చెల్లింపు..

ఈ రోజు జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలక వడ్డీ రేటైన రెపో రేటును రిజర్వు బ్యాంక్ మరో సారి పెంచింది. 4.40 శాతంగా ఉన్న దీనిని 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి పెంచింది.

RBI Repo Rate Hike: రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన RBI.. ఖరీదుగా మారనున్న రుణాల చెల్లింపు..
Rbi
Follow us

|

Updated on: Jun 08, 2022 | 11:13 AM

RBI Repo Rate Hike: ఈ రోజు జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలక వడ్డీ రేటైన రెపో రేటును రిజర్వు బ్యాంక్ మరో సారి పెంచింది. 4.40 శాతంగా ఉన్న దీనిని 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి పెంచింది. ప్రస్తుత సంవత్సరానికి GDP వృద్ధి 7.2% వద్ద ఉంచినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుత సంవత్సరానికి ద్రవ్యోల్బణం మునుపటి 5.7% నుంచి 6.7%కి సవరించినట్లు తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి దానిని 4.90 శాతానికి చేర్చింది. గత నెల మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్-సైకిల్ సమావేశంలో రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత.. రెపో రేటు 4.40%నికి చేరుకుంది. రెపో రేటు ఇప్పటికీ ప్రీ-పాండమిక్ స్థాయి కంటే తక్కువగా ఉంది. మహమ్మారి పరిస్థితిలో అసాధారణమైన వసతిని క్రమంగా ఉపసంహరించుకోవాలనే నిర్ణయంలో MPC ఏకగ్రీవంగా అంగీకరించినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ కూడా MSF రేటు, బ్యాంక్ రేటును 4.65% నుంచి 5.15%కి పెంచాలని నిర్ణయించింది.

ప్రపంచ సవాళ్లను గవర్నర్ వివరిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, ఉక్రెయిన్ యుద్ధం, మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నదని వెల్లడించారు. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఎక్కువ భాగం యుద్ధం కారణంగా మారిందని తెలిపారు. లాజిస్టిక్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటం ధరల పెరుగుదలకు కారణమౌతోంది. కేవలం రెండు నెలల్లో రెండోసారి వడ్డీ రేటు పెంపుదల ఆశ్చర్యం కలిగించదు.. ఎందుకంటే పెరుగుదలను ముందుగానే అందరూ ఊహించారు కాబట్టి. బ్లూమ్‌బెర్గ్ పోల్‌లో పాల్గొన్న 41 మంది ఆర్థికవేత్తల్లో మొత్తం 17 మంది MPC 50 బేసిస్ పాయింట్ల రేటు పెంపును ప్రకటించాలని భావిస్తున్నట్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో 11 మంది 40 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపును ఆశించారు. ఈ రేట్ల పెంపు కారణంగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్ తో పాటు ఇతర MCLR అనుసంధానించిన రుణాల ఈఎంఐ చెల్లింపులు ఇకపై పెరగనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.