ఆ రాష్టంలో దిగజారుతున్న పరిస్థితులు.. రూ.250కు వంటనూనె.. రూ.200లకు పెట్రోల్
నెలరోజుల క్రితం మణిపుర్‌లో అల్లర్లు మొదలైన్పపటి నుంచి అక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. మైటీ, కూకీల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు జరగడంతో పౌర సంస్థలు జాతీయ రహదారి నెంబర్ 2 ను మూసివేయడం.. ఇంఫాల్ లోకి సరకులు రవాణా చేసే ట్రక్కులను అడ్డుకున్నారు.

నెలరోజుల క్రితం మణిపుర్‌లో అల్లర్లు మొదలైన్పపటి నుంచి అక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. మైటీ, కూకీల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు జరగడంతో పౌర సంస్థలు జాతీయ రహదారి నెంబర్ 2 ను మూసివేయడం.. ఇంఫాల్ లోకి సరకులు రవాణా చేసే ట్రక్కులను అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ ఫలితమే నిత్యవసర ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర బ్లాక్ మార్కెట్‌లో రూ.200లకు ఎగబాకింది. ఆఖరికి పెట్రోల్ పంపులలో కూడా ఇంధనం అయిపోతోంది. ఇంతకు ముందు రూ.30 కేజీ బియ్యాం అందుబాటులో ఉండగా ఇప్పుడు దాని ధర రూ.60 కి చేరింది. ఉల్లపాయల ధర రూ.70 పలుకుతోంది.
అలాగే వంటనూనె ధర రూ.250కి చేరింది. మరోవైపు ఔషధాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైటీ, కూకీ వర్గాల ప్రజలు ఆశ్రయం పొందుతున్న క్యాంపుల్లో కూడా సరిపడ ఆహారం దొరకడం లేదు. చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. మరికొందరు అనారోగ్యం బారీనా పడుతున్నారు. అక్కడ కనీసం వైద్య సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ప్రతిరోజూ కర్ఫ్యూను కొన్ని గంటలు మాత్రమే సడలించడంతో సమస్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. అక్కడ ఏటీఎంలలో కూడా డబ్బులు అందుబాటులో ఉండకపోవడం, ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవడం, కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రజలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








