Odisha Train Accident: రికార్డు టైమ్ లో ట్రాక్ రిపేర్, 51గంటల్లోనే పునరుద్ధరణ
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్‌లో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ట్రాక్ ను సరి చేసి రైల్వే సేవలు తిరిగి పునరుద్ధరించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంలోనే వుండి పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు.
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్‌లో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ట్రాక్ ను సరి చేసి రైల్వే సేవలు తిరిగి పునరుద్ధరించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంలోనే వుండి పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. వెయ్యిమంది కూలీలు, భారీగా యంత్రాలు ఉపయోగించి, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేశారు. పూర్తిగా ధ్వంసమైన రెండు ట్రాక్‌లను కేవలం 51 గంటల్లోనే తిరిగి పునరుద్ధరించారు. పునరుద్ధరించిన ట్రాక్‌పై గూడ్స్ రైలు వెళ్తుండగా తీసిన వీడియోను వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్రాక్ పై గ్రూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో ఆయన రెండు జోతులు జోడించి నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం సాయంత్రం తొలి రైలు ట్రాక్‌లపై నడిచిందని ట్వీట్ చేశారు. కాగా, దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ రైల్వే ప్రమాదంలో 275 మంది మృతి చెందారు. 1100 మంది వరకు గాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పిల్లల కేర్ టేకర్.. కోటీశ్వరురాలు
ఆ కొలనులో నీరు ఎప్పటికీ ఎండిపోదు.. 5వేల ఏళ్ల మిస్టరీ
ట్రెండ్ అవుతున్న బెడ్ రాటింగ్.. అసలేంటది ??
కదులుతున్న కారుపై మద్యం తాగుతూ పుష్ అప్స్ !!
నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!