AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bundelkhand Expressway: నేడే యూపీలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రతిష్టాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం..

ప్రధాని మోడీ.. 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే దీని పనులు పూర్తయ్యాయి. 296 కి.మీ విస్తరించి ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రకూట్, ఇటావా మధ్య ఉంది.

Bundelkhand Expressway: నేడే యూపీలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రతిష్టాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2022 | 6:32 AM

Share

Bundelkhand Expressway – PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్‌ల ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈమేరకు జలౌన్‌ జిల్లాలోని తహసిల్‌లోని కైతేరి గ్రామంలో జరిగే కార్యక్రమంలో మోడీ పాల్గొని ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించనున్నారు. దీంతోపాటు పలు పథకాలకు శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. యూపీ సహా దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్రం ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణాలకు రవాణా, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఈ రహదారిని నిర్మించింది. ప్రధాని మోడీ.. 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే దీని పనులు పూర్తయ్యాయి. 296 కి.మీ విస్తరించి ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రకూట్, ఇటావా మధ్య ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే షెడ్యూల్ కంటే ఎనిమిది నెలల ముందే పూర్తయింది.

ఈ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్ వే చిత్రకూట్, బండా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కప్, ఆగ్రా- ఇటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది. దీనిని లక్నోఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి

సుమారు 15,000 కోట్లతో..

ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) అభివృద్ధి చేసిన ఈ నాలుగు లేన్‌ల ఎక్స్‌ప్రెస్‌వేను భవిష్యత్తులో ఆరు లేన్‌లకు విస్తరించే అవకాశం ఉంది. దీనికి 13 ఇంటర్‌చేంజ్ పాయింట్లు ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా దాదాపు రూ.1,132 కోట్లు ఆదా చేసింది.

నేరుగా దేశ రాజధానికి అనుసంధానం..

ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో కనెక్టివిటీని, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని పేర్కొంటున్నారు. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న బుందేల్‌ఖండ్ నుంచి ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా నేరుగా దేశ రాజధానికి అనుసంధానం అవుతుందని అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్‌ కోసం..

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ, చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. 9-10 గంటల నుంచి కేవలం ఆరు గంటలకు తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్ విజయవంతానికి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే కూడా కీలకం. కాగా.. ఇప్పటికే.. బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో 5,071 హెక్టార్లలో రూ.20,000 కోట్లతో డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రాష్ట్రంలో 3,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 13 ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడింటిలో ఆరు పనులు కొనసాగుతున్నాయి. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తున్నారు.

జాతీయ వార్తల కోసం..