Parliament: దాడికి ఒకరు.. ఎదురుదాడికి మరొకరు .. పార్లమెంట్‌ సమరానికి అధికార-విపక్షాల సన్నద్ధం..

Parliament Monsoon Sessionఫ: పార్లమెంట్‌ సమరానికి వేళయ్యింది. ఎప్పటిలాగే.. అధికారపక్షంపై దాడికి రెడీ అయింది ప్రతిపక్షం. విపక్షాలపై ఎదురుదాడికి వ్యూహాలు రచిస్తోంది అధికార పార్టీ.

Parliament: దాడికి ఒకరు.. ఎదురుదాడికి మరొకరు .. పార్లమెంట్‌ సమరానికి అధికార-విపక్షాల సన్నద్ధం..
Parliament
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 15, 2022 | 9:31 PM

నిత్యావసరాల దగ్గర నుంచి ఇంధన ధరల దాకా చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో ఈనెల 18 నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరగబోతున్నాయి. సామాన్య ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కారు తీరును పార్లమెంట్‌లో ఎండగట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ బృందం సమావేశమైంది. దాదాపు గంట పాటు అనేకాంశాలపై చర్చించింది కమిటీ. దేశంలో నిరుద్యోగం, రూపాయి పతనంతో పాటు తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు వెంట పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చించాలని నిర్ణయించింది కాంగ్రెస్‌.

సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తోన్న గ్యాస్‌ ధరల పెరుగుదలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ అగ్నిపథ్‌ అంశాన్ని సైతం లేవనెత్తనున్నట్లు చెప్పారు. పార్టీ నేత రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారని తెలిపారు.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో, ఉభయ సభల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్‌. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులతో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న టీఆర్‌ఎస్‌.. ఈసారి పార్లమెంట్‌ కేంద్రంగా గళం విన్పించే చాన్సుంది. విభజన సమస్యల పరిష్కారంతో పాటు.. నిత్యావసర ధరల పెరుగుదలనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రస్తావించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ఇక.. బ్రిటిష్ పాలనలో నిర్మించిన పార్లమెంట్‌ భవనంలో చివరి సమావేశాలు ఇవే. ఈనెల 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. డిసెంబరులో జరిగే శీతకాల సమావేశాలు నూతన సెంట్రల్‌ విస్తాలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

జాతీయ వార్తల కోసం..