PM Narendra Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా ఒకేసారి లక్ష మందికి రిక్రూట్‌మెంట్ లెటర్స్..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకేసారి లక్ష మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేయనున్నారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో వేర్వేరు పోస్టుల్లో నియమితులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12వ తేదీన ఎంప్లాయ్‌మెంట్ మేళా కింద నిర్వహించనున్నారు.

PM Narendra Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా ఒకేసారి లక్ష మందికి రిక్రూట్‌మెంట్ లెటర్స్..!
Narendra Modi
Follow us

|

Updated on: Feb 11, 2024 | 7:04 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకేసారి లక్ష మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేయనున్నారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో వేర్వేరు పోస్టుల్లో నియమితులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12వ తేదీన ఎంప్లాయ్‌మెంట్ మేళా కింద నిర్వహించనున్నారు. దేశంలోని 47 చోట్ల ఏకకాలంలో ఉపాధి మేళాను నిర్వహించనున్నారు. దీనితో పాటు న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిపన కర్మయోగి భవన్ ఫేజ్ 1 నిర్మాణ పనులను ప్రధాని మోదీ అదేరోజు ప్రారంభించనున్నారు.

దేశంలో ఉద్యోగాల కల్పనలో ఉపాధి మేళా ఒక ముఖ్యమైన అడుగు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫిబ్రవరి 12న ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి లక్ష మందికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. అంతేకాకుండా, కొత్తగా నియమితులైన ఉద్యోగులు ఆన్‌లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రారంభం ద్వారా కూడా శిక్షణ పొందుతారు. ఈ కార్యక్రమం కింద, కర్మయోగి పోర్టల్‌లో 880కి పైగా ఇ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వివిధ శాఖలు ఈ లక్ష ఉద్యోగాలు కల్పిస్తోంది. వీటిలో రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్య, అణు ఇంధనం, రక్షణ శాఖ, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖలు ఉన్నాయి. ఉపాధి మేళా ద్వారా యువత మరిన్ని అవకాశాలు పొందాలని భావిస్తున్నారు. దేశాభివృద్ధితో వారిని అనుసంధానం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన క‌ర్మయోగి భ‌వ‌న్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించ‌నున్నారు. ఈ కాంప్లెక్స్ ద్వారా, మిషన్ కర్మయోగి వివిధ కార్యక్రమాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు వీలవుతుంది. మిషన్ కర్మయోగి కింద, ఉద్యోగులకు నైతిక విలువలపై శిక్షణ ఇస్తారు. సమాజంలోని వివిధ వర్గాల, భౌగోళిక ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా వారి బాధ్యతలను నిర్ణయించుకుంటారు. దీంతో విధి నిర్వహణలో బాధ్యత కలిగిన అధికారులుగా మారుతారని మోదీ సర్కార్ భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

జనసేనలో ఎగిసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు..
జనసేనలో ఎగిసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు..
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదు.. మొదటి బంతికే సిక్స్ కొట్టాలి
ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదు.. మొదటి బంతికే సిక్స్ కొట్టాలి
సందీప్‌కి భారీ ఫాలోయింగ్‌! నార్త్ కూ 'నయన్' లేడీ సూపర్‌స్టార్‌!
సందీప్‌కి భారీ ఫాలోయింగ్‌! నార్త్ కూ 'నయన్' లేడీ సూపర్‌స్టార్‌!
కుప్పం సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..
కుప్పం సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..
ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయా.. వీటితో ఒత్తుగా మార్చేయండి!
ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయా.. వీటితో ఒత్తుగా మార్చేయండి!
టీమిండియా విజయంలో ఆ ముగ్గురే కీలకం.. వారు లేకుంటే అధోగతి..!
టీమిండియా విజయంలో ఆ ముగ్గురే కీలకం.. వారు లేకుంటే అధోగతి..!
ఏ ఒక్కరి కోసం కాదు.. దేశ ప్రజలందరి కోసం మోదీ సర్కార్
ఏ ఒక్కరి కోసం కాదు.. దేశ ప్రజలందరి కోసం మోదీ సర్కార్
నిరుద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి..
నిరుద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి..
పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు మహిళలు పడే బాధల గురించి ఎవరు చెబుతారు?
పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు మహిళలు పడే బాధల గురించి ఎవరు చెబుతారు?
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..
ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..
నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి
నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి
సైనిక వీరులకు సెల్యూట్.. మీరే లేకపోతే ఆ 500 మంది పర్యాటకులా.?
సైనిక వీరులకు సెల్యూట్.. మీరే లేకపోతే ఆ 500 మంది పర్యాటకులా.?