Yuvraj meet Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. కారణం అదేనా..?
భారత మాజీ క్రికెట్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరతున్నారా? పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం గురుదాస్‌పూర్ నుంచి బీజేపీకి చెందిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

భారత మాజీ క్రికెట్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరతున్నారా? పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం గురుదాస్‌పూర్ నుంచి బీజేపీకి చెందిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన యువరాజ్ రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేరుతాడన్న పుకార్లు షికార్లు చేశాయి. గడ్కరీని ఫిబ్రవరి 9, శుక్రవారం నాడు న్యూఢిల్లీలో యువరాజ్, అతని తల్లి షబ్నమ్ సింగ్ కలుసుకున్నారు. వారి సమావేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. 2019లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న యువరాజ్, రాజకీయాల్లో చేరాలనే కోరికను ఎప్పుడూ వ్యక్తం చేయలేదు.
📍नई दिल्ली
भारत🇮🇳 के महान क्रिकेट🏏 खिलाड़ी रहे श्री @YUVSTRONG12 जी और उनकी माँ श्रीमती शबनम सिंह जी के साथ भेंट हुई। pic.twitter.com/MLCMqPMLU0
— Nitin Gadkari (@nitin_gadkari) February 9, 2024
అయితే, యువరాజ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జోరందుకుంది. సన్నీ డియోల్ తర్వాత నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని మారవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుంటే, యువరాజ్ తన మాజీ భారత క్రికెట్ టీమ్ సహచరులు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రాజకీయాల్లోకి కొనసాగుతున్నారు. గౌతమ్ గంబీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ కాగా, హర్భజన్ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా ఉన్నారు. ఇక మిగిలిన క్రికెటర్ల విషయానికి వస్తే, మాజీ టీమిండియా కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్ వంటి పలువురు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి విజయవంతమైన రాజకీయ జీవితాన్ని ఆస్వాదించారు. యువరాజ్ సింగ్ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, మాజీ భారత ఆల్ రౌండర్ రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.
అత్యుత్తమ క్రికెట్ కెరీర్
మరోవైపు యువరాజ్ సింగ్ టీమిండియాతో అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌ను ఆస్వాదించాడు. ఆల్ టైమ్ అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలలో కీలక పాత్ర పోషించారు. 2007 T20 ప్రపంచ కప్‌లో, అతను సెమీ-ఫైనల్స్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో సహా ఆరు మ్యాచ్‌లలో భారతదేశం తరపున 148 పరుగులు చేశాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
టీమ్ ఇండియా కోసం అతని ఆల్ రౌండ్ ప్రదర్శన తర్వాత, 2011 ODI ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. అయితే క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ, ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో యువరాజ్ 362 పరుగులు, 15 వికెట్లు తీయడం ద్వారా 28 సంవత్సరాల తర్వాత భారతదేశం చిరస్మరణీయ వన్డే ప్రపంచ కప్ విజయానికి హీరోగా నిలిచాడు. యువరాజ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ గొప్ప ఆల్ రౌండర్ టెస్టుల్లో 1900 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టగా, వన్డేల్లో 8,701 పరుగులు చేసి 111 వికెట్లు తీశాడు. T20 లలో, అతను 58 మ్యాచ్‌లలో 136.38 స్ట్రైక్ రేట్‌తో 1177 పరుగులు చేశాడు. 28 వికెట్లు తీసుకున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




