AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Tour: నేటి నుంచి ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు.. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ 7 నగరాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..

నేడు రేపు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ , డామన్ & డయ్యూలను సందర్శిస్తారు. రేపు తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ప్రయాణించే మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.   

PM Modi Tour: నేటి నుంచి ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు.. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ 7 నగరాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
Pm Modi Tour
Surya Kala
|

Updated on: Apr 24, 2023 | 6:48 AM

Share

ఇవాళ్టి నుంచి 7 నగరాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు 36 గంటల్లో 5,300 కి.మీ ప్రయాణించనున్నారు మోదీ. 7 నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రధాని. మధ్యప్రదేశ్‌, రేవా, ఖజురహో, కొచ్చి, తిరువనంతపురం, సిల్వాసా, సూరత్‌లో పర్యటించనున్నారుప్రధాని. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు రేవాకు రానున్నారు. ప్రధాని మోడీ తో పాటు కేంద్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రాంతీయ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నిఘా వర్గాలు, జిల్లా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నగరం అంతటా 144 సెక్షన్ విధించారు. నగరంలో నిఘా ఉంచారు.

నేడు రేపు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ , డామన్ & డయ్యూలను సందర్శిస్తారు. రేపు తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ప్రయాణించే మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన   .కొచ్చి వాటర్ మెట్రోతో పాటు, దిండిగల్-పళని-పాలక్కాడ్ సెక్షన్ రైలు విద్యుద్దీకరణను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. రేపు కేరళలోని కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాదు మంగళవారం తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

పోర్ట్ సిటీ కొచ్చిలో వాటర్ మెట్రో సర్వీస్ రూ.1,136.83 కోట్లతో నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ కింద, సమీపంలోని 10 ద్వీపాలు కొచ్చి నగరానికి అనుసంధానించబడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..