AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఇవాళ సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. అందుబాటులోకి మరో ఆవిష్కరణ..

ప్రధాని మోడీ కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంతోపాటు ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

PM Narendra Modi: ఇవాళ సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. అందుబాటులోకి మరో ఆవిష్కరణ..
Central Vista Avenue
Shaik Madar Saheb
|

Updated on: Sep 08, 2022 | 8:20 AM

Share

Central Vista Avenue: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు కీలక ప్రాజెక్టుకు ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గురువారం సాయంత్రం సెంట్రల్ విస్టా అవెన్యూ (రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు పునరుద్ధరించిన కర్తవ్యపథ్ మార్గ్, డ్యూటీ పాత్) ను ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంతోపాటు ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. పునరుద్ధరించిన స్ట్రెచ్‌లో నాలుగు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు డ్రోన్ షో కూడా జరగనుంది. ప్రధాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇండియా గెట్‌ పరిధిలోని అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే ట్రాఫిక్‌ను పలు మార్గాల్లో మళ్లీంచారు.

పునరుద్ధరించిన అవెన్యూ ప్రాంతంలోరాష్ట్రాల వారీగా ఫుడ్ స్టాల్స్, చుట్టూ పచ్చదనంతో కూడిన రెడ్ గ్రానైట్ రాయితో వేసిన మార్గాలు, వెండింగ్ జోన్‌లు, పార్కింగ్ స్థలాలు, మెరుగైన సదుపాయాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రారంభం అనంతరం ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం ప్రాంతాన్ని ‘డ్యూటీ పాత్’ అని పిలవనున్నారు. కాగా, ఢిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్టా మార్గాలను.. ఇక మీదట కర్తవ్యపథ్ (Kartavya path) గా మారుస్తు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 20 నెలల తర్వాత, ఇండియా గేట్, రాజ్‌పథ్‌లు సందర్శకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా అవెన్యూ చుట్టుపక్కల ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్లు, తాగునీరు, స్ట్రీట్ ఫర్నీచర్, తగిన పార్కింగ్ స్థలం వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల రాజ్‌పథ్ పునరాభివృద్ధి జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..