AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కారు ఆపి బాలిక‌ను ఆశీర్వదించిన ప్రధాని మోదీ.. అమ్మాయి గీసిన చిత్రంను..

ప్రధాని నరేంద్ర మోదీ ఆ అమ్మాయిని కలుసుకుని ఆమె వేసిన పెయింటింగ్‌ను బహుమతిగా స్వీకరించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ అమ్మాయితో కాసేపు మాట్లాడారు.

PM Modi: కారు ఆపి బాలిక‌ను ఆశీర్వదించిన ప్రధాని మోదీ.. అమ్మాయి గీసిన చిత్రంను..
Pm Narendra Modi
Sanjay Kasula
|

Updated on: May 31, 2022 | 5:44 PM

Share

సిమ్లాలో తన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. అయితే ఓ అమ్మాయి వేసిన పెయింటింగ్‌ను స్వీకరించేందుకు తన కారును ఆపడంతో జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ అమ్మాయిని కలుసుకుని ఆమె వేసిన పెయింటింగ్‌ను బహుమతిగా స్వీకరించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ అమ్మాయితో కాసేపు మాట్లాడారు. ఈ పెయింటింగ్స్ నువ్వే వేస్తావా అని అడిగాడు. దీనిపై ఆ అమ్మాయి అవును తానే చేశానని చెప్పింది. దీన్ని తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించగా.. ఒక్క రోజులో దీన్ని ఆ డ్రాయింగ్ వేసినట్లుగా చేప్పింది ఆ అమ్మ.

తల్లి పెయింటింగ్‌ను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ..

ఇవి కూడా చదవండి

నిజానికి ఈ పెయింటింగ్ తన తల్లి హీరాబెన్ మోడీది, దానిని చూసి ప్రధాని నరేంద్ర మోడీ తన కారును ఆపివేసారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కాలినడకన అమ్మాయిని చేరుకున్నారు. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత పెయింటింగ్‌ను బహుమతిగా స్వీకరించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా బాలిక తలపై చేయి వేసి ఆశీర్వదించారు.

పీఎం కిసాన్ పథకానికి రూ.21,000 కోట్లు విడుదల

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సిమ్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన ముచ్చటించి అనంతరం రోడ్‌షో నిర్వహించారు. కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడతగా 21,000 కోట్ల రూపాయలను ఈ సిమ్లా నుండే ప్రధాని మోదీ విడుదల చేశారు.

ప్రధాని మోదీ ఆ మహిళతో మాట్లాడుతూ..

లబ్ధిదారులతో ఇంటరాక్షన్ సందర్భంగా.. కర్ణాటకలోని కలబురగికి చెందిన సంతోషి అనే మహిళ తన అభిప్రాయాలను వెల్లడించిన తీరు తనను ప్రభావితం చేసిందని.. ఆమె బిజెపి కార్యకర్త అయితే ఎన్నికల్లో పోటీ చేయమని కోరేవాడినని ప్రధాని అన్నారు. లడఖ్‌కు చెందిన ఒక మాజీ సైనికుడు తాను జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన (గ్రామీన్) నుంచి లబ్ది పొందానని, ఈ పథకాన్ని పొందడంలో తనకు ఎలాంటి సమస్య లేదని ప్రధానికి చెప్పారు.

జాతీయ వార్తల కోసం..

Follow Us