AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Yatra: భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత, కారణం ఇదే..!

Kedarnath Yatra: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ కారణంగా, కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత తిరిగి భక్తులను అనుమతించనున్నారు.

Kedarnath Yatra: భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత, కారణం ఇదే..!
Kedarnath Temple
Rajashekher G
|

Updated on: May 31, 2026 | 2:30 PM

Share

Kedarnath Yatra: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ కారణంగా, కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల ప్రకారం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, మార్గం సురక్షితమని నిర్ధారించిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తారు.

గత రాత్రి నుంచి రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కేదార్‌నాథ్ ట్రెకింగ్ మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఇతర ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని గర్హ్వాల్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

భక్తులకు విజ్ఞప్తి..

యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి ఈ ముందుజాగ్రత్త చర్య తీసుకున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ తెలిపారు. వాతావరణం తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు పరిపాలన యంత్రాంగం సూచనలను పాటించాలని, నిర్దేశించిన నిరీక్షణ ప్రాంతాలు, సురక్షిత ప్రదేశాలలోనే ఉండాలని ఆయన యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.

ప్రయాణం కొనసాగించడానికి అనుమతి లేదు..

కేదార్‌నాథ్ వైపు వెళ్లే యాత్రికులను శ్రీనగర్‌తో సహా పలు చోట్ల ఆపాలని సంబంధిత శాఖలను పరిపాలన యంత్రాంగం ఆదేశించింది. వాతావరణం మెరుగుపడే వరకు ఏ యాత్రికుడిని ముందుకు వెళ్లడానికి అనుమతించరు. కాగా, గత కొద్ది రోజులుగా కేదార్‌నాథ్ యాత్రకు భక్తుల తాకిడి భారీగా ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను దర్శించడానికి ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఈ భారీ జనసందోహం కారణంగా, పాదయాత్ర మార్గంలోని అనేక ప్రదేశాలలో పొడవైన క్యూలు, ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి.

వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే యాత్రను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. వదంతులను పట్టించుకోవద్దని, నిర్వాహకులు విడుదల చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.

Follow Us
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?