Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త డిజైన్‌పై పెదవి విరిచిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఏకంగా కేంద్ర మంత్రికి..

ప్రపంచ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించి.. సౌకర్యాలు కల్పిస్తారేమో కానీ.. పైన పేర్కొన్న డిజైన్ మాత్రం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదంటూ పేర్కొంటున్నారు.

Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త డిజైన్‌పై పెదవి విరిచిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఏకంగా కేంద్ర మంత్రికి..
Nag Ashwin
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:40 PM

Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లను ప్రకటించి కాంట్రాక్టు కూడా ఇచ్చేశామని.. ఇక పనులు కూడా ప్రారంభమవుతాయిని సౌత్ సెంట్రల్ రైల్వే సైతం ప్రకటించింది. రైల్వే స్టేషన్ డిజైన్‌కు సంబంధించి నాలుగు ఫొటోలను సైతం కేంద్ర మంత్రి షేర్ చేశారు. అయితే రైల్వే మంత్రి విడుదల చేసిన గ్రాఫిక్స్ చూసి చాలామంది అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి చేసిన ట్విట్‌కు.. రీట్విట్ చేస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించి.. సౌకర్యాలు కల్పిస్తారేమో కానీ.. పైన పేర్కొన్న డిజైన్ మాత్రం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదని.. ఓ సాదా సీదా భవనంలా ఉందంటూ పేర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ ఐటీకంపెనీ భవనంలా ఉందని.. మళ్లీ దీనిపై పునరాలోచించాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసుడు.. శ్రీ వేంకటేశ్వరస్వామిని గుర్తు తెచ్చేలా డిజైన్ ఉండాలని సూచనలు సూచనలు చేస్తున్నారు.

కాగా.. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ట్వీట్ చేసి పలు సూచనలు చేశారు. ‘‘మీ వ్యాఖ్యలను చూడండి.. దీన్ని ఎవరూ ఇష్టపడరు… డిజైన్ కొంత జెనరిక్ వెస్ట్రన్ కాపీ, కొంత బ్యాడ్ ఐటీ పార్క్ లాగా ఉంది.. తిరుపతి పవిత్రమైనది, ఆధ్యాత్మికం నగరం.. భారతదేశం గొప్ప వాస్తుశిల్పాన్ని అర్థం చేసుకున్న వారితో దీనిని రూపొందించడానికి ప్రయత్నించండి.. గాజు, స్టీల్ కాపీలు వద్దు’’ అంటూ నాగ్ అశ్విన్ ట్విట్ చేశారు.

ఇవి కూడా చదవండి

నాగ్ అశ్విన్‌తో పాటు పలువురు నెటిజన్లు మంత్రి ట్విట్‌కు రిట్విట్ చేస్తూ.. డిజైన్ బాగాలేదని.. మార్చాలంటూ కోరుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!