PM Modi: భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నది వాళ్లే.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
బీజేపీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత గుజరాతీలపై ఉందన్నారు ప్రధాని మోదీ. నర్మదా డ్యాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లే భారత్‌జోడో యాత్రలో పాల్గొంటున్నారని రాహుల్‌పై విమర్శలు చేశారు.

గుజరాత్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రచారానికి ముందు ఆదివారం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు మోదీ.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్‌లో బీజేపీకి మరో విజయం కట్టబెట్టి కొత్త రికార్డులు సృష్టించాలని పిలుపునిచ్చారు మోదీ. భారీగా ఓటింత్ శాతం నమోదయ్యేలా చూడాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమన్నారు మోదీ. ఈ లక్ష్య సాధనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలన్నారు. గుజరాతీలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారి ఆశీర్వాదాలు తనకు కావాలని కోరారు. రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రపై విమర్శలు
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రపై విమర్శలు చేశారు మోదీ. నర్మదా డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకించిన మేథాపాట్కర్ భారత్ జోడో యాత్రకు హాజరైన విషయాన్ని గుజరాత్ ప్రజలు గుర్తించాలని అన్నారు. సోమవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొంటారు. కచ్‌లో ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ ముఖద్వారంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు మోదీ. సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొన్నారు. ఈ రోజు ప్రధాని మోడీ సురేంద్రనగర్, భరూచ్, నవ్సారిలో మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు.




From healthcare to housing, education to agriculture, water supply to IT, the people of Gujarat have seen the changes under @BJP4Gujarat while the Opposition only keeps defaming Gujarat and abusing the people of the state. pic.twitter.com/Z9SDzyNlsl
— Narendra Modi (@narendramodi) November 20, 2022
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ.. ఆదివారం రాత్రి హఠాత్తుగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడున్న కార్యకర్తలు, నాయకులతో ముచ్చటించారు. కాగా, చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా ప్రధాని మోదీ తమ మధ్యకు రావడంతో పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు.
After a long day of campaigning, being among fellow Karyakartas at Kamalam is very energising! pic.twitter.com/Yqf4ikaLIn
— Narendra Modi (@narendramodi) November 20, 2022
గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి జరుగుతాయి. రెబల్స్‌కు బరి లోకి దిగిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..