AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangalore Blast: కోయంబత్తూరు పేలుడుకు.. మంగళూర్‌ బ్లాస్ట్‌తో లింకులు.. ప్రైవేట్ టీచర్ సహా మరో ఇద్దరు అరెస్ట్‌

 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మంగళూరు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక సూత్రధారితో సాన్నిహిత్యంగా ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.

Mangalore Blast: కోయంబత్తూరు పేలుడుకు.. మంగళూర్‌ బ్లాస్ట్‌తో లింకులు.. ప్రైవేట్ టీచర్ సహా మరో ఇద్దరు అరెస్ట్‌
Mangalore Blast
Shaik Madar Saheb
|

Updated on: Nov 21, 2022 | 8:56 AM

Share

Mangalore Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మంగళూరు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక సూత్రధారితో సాన్నిహిత్యంగా ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి.. పలు కీలకవిషయాలను సేకరించింది. దీనివెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు. కాగా, PFI సంస్థతో షరీఖ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిర్ధారించారు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు షరీఖ్‌. ఫేక్‌ ఆధార్‌కార్డుతో కర్నాటక లోని పలు ప్రాంతాల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. 2020లో కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద షరీఖ్‌ అరెస్టయ్యాడు. అనంతరం సాంకేతిక కారణాల వల్ల షరీఖ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో షరిఖ్ తిరిగాడని.. పలువురిని కలిసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వారందరినీ.. పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళూరు బ్లాస్ట్ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

ప్రైవేట్ టీచర్ అరెస్ట్..

ఈ కేసులో ఓ ప్రైవేట్‌ టీచర్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణమైన మహ్మద్‌ షరీఖ్‌కు కోయంబత్తూరు లింకులు ఉన్నట్లు గురర్తించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ టీచర్‌ సురేందర్‌.. గాంధీపురంలోని లాడ్జిలో నెల క్రితం ఉన్నట్టు సమాచారం. ఊటీలో స్కూల్‌ టీచర్‌గా సురేందర్‌ పనిచేస్తున్న సురేందర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించేందుకు సిద్దమవుతున్నారు.

అయితే, తమిళనాడు.. కోయంబత్తూరు పేలుడుకు మంగళూర్‌ బ్లాస్ట్‌కు సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. PFI సంస్థపై నిషేధానికి ప్రతీకారంగా అరాచకశక్తులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆటోలో పేలుడుపై మంగళూరు పోలీసులతో పాటు ఎన్‌ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..