PM Modi Varanasi Visit: యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరం.. వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ..
యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది పునాది అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ (PM Modi Varanasi Visit)వారణాసి...
యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది పునాది అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ (PM Modi Varanasi Visit)వారణాసి పర్యటన మొదలైంది. ముందుగా ఆయనకు సీఎం యోగి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన వరల్డ్ యూత్ స్కిల్స్ డే కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిలోనే ఈ రోజును జరుపుకోవడం ఇది రెండవసారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లు.. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రాధాన్యాన్ని పెంచిందని తెలిపారు.
రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ను(Rudraksh Convention Center) ఆయన ప్రారంభించనున్నారు. సొంత నియోజక వర్గం వారణాసి నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో అన్ని రకాల అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు కావాల్సిన సదుపాయాల్ని అందించనున్నారు. ఇక్కడ విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 120 కార్లను ఒకేసారి పార్కింగ్ చేయవచ్చు.
ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్..
మధ్యాహ్నం 2.15 గంటలకు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు BHU MCH వింగ్ నుంచి PHU హెలిప్యాడ్‌కు PM మోడీ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు BHU హెలిప్యాడ్ నుంచి సంస్కృత విశ్వవిద్యాలయ హెలిప్యాడ్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.55 గంటలకు PM మోడీ సంస్కృత విశ్వవిద్యాలయ హెలిప్యాడ్‌లో దిగి రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరుతారు. 2.10 గంటలకు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.