Kokapet lands: కోకాపేట భూముల వేలం.. యాక్షన్‌లో పాల్గొనాలని ఉంటే ఇలా చేయండి..

తెలంగాణ‌లో ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధమైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో భూముల వేలానికి మార్గం సుగ‌మం అయ్యింది. రంగారెడ్డి జిల్లా...

Kokapet lands: కోకాపేట భూముల వేలం.. యాక్షన్‌లో పాల్గొనాలని ఉంటే ఇలా చేయండి..
Kokapet Lands
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 15, 2021 | 10:26 AM

తెలంగాణ‌లో ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధమైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో భూముల వేలానికి మార్గం సుగ‌మం అయ్యింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియోపొలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్లతో పాటు గోల్డెన్‌ మైల్‌ లే అవుట్‌లోని ప్లాటును ఆన్‌లైన్‌ వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లుగా HMDA నిర్ణయించినా.. అందుకు రెట్టింపు ధర వస్తుందని ఆ సంస్థ వర్గాలు ధీమాతో ఉన్నాయి. ఈ లెక్కన రూ.2,500 కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో భూముల వేలానికి మార్గం సుగ‌మం అయ్యింది.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

భూముల వేలాన్ని ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో.. ఆన్‌లైన్‌లో భూముల వేలాన్ని నిర్వ‌హించ‌నుంది కేంద్ర‌రంగ సంస్థ MSTC.. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు. కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ద్వారా HMDA, TS IIC భూముల అమ్మకం ద్వారా 5000 కోట్ల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు… ప్లాట్‌ నంబర్‌లు: నియోపోలిస్‌ లేఅవుట్‌ ప్లాట్లు 1,2,3,12 మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు… ప్లాట్‌ నంబర్‌లు: నియోపోలిస్‌ లేఅవుట్‌ ప్లాట్లు 4, 13, ప్లాట్‌ ఏ,

                                 గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌ ప్లాట్‌ నంబర్‌ 2/పీ/వెస్ట్‌ పార్ట్‌

కోకాపేటకు చెందిన భూమిని 8ప్లాట్లు చేసింది. ఈ 8 ప్లాట్లలో ఉదయం 4 ప్లాట్లు, మధ్యాహ్నం తర్వాత 4 ప్లాట్లు వేలం వేయనున్నారు. రెండో రోజు ఆన్ లైన్ బిడ్డింగ్ లో టీఎస్ఐఐసీకి చెందిన 30 ఎకరాలు 6 ప్లాట్లు వేలానికి వేయనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.

విజయశాంతి పిటిషన్.. కోర్టు తీర్పు..

కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు చేస్తుండ‌గా.. వేలంపై హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత‌ విజయశాంతి. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెంబర్‌ 13 ను కొట్టివేయాలని ఆమె కోర్టును కోరారు. పిటిషన్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టగా..నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందునే వేలం వేస్తున్నామ‌ని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భూములను కాపాడుకోలేక ప్రభుత్వమే అమ్ముకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

భూముల వేలాన్ని ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో.. ఆన్‌లైన్‌లో భూముల వేలాన్ని నిర్వహించ‌నుంది కేంద్రరంగ సంస్థ ఎంఎస్‌టీసీ. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏ, టీఎస్‌ఐఐసీ భూముల అమ్మకం ద్వారా 5 వేల కోట్ల రూపాయలు రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Rotten Eggs: నిర్లక్ష్యం.. నిద్ర మత్తు.. గర్భిణీలకు కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ..

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం