Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరో 24 గంటలు పాటు కురిసే అవకాశం

Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌,..

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరో 24 గంటలు పాటు కురిసే అవకాశం
Hydarabad Rains
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 15, 2021 | 12:00 PM

Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ప్రాంతాలతో సహా సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిన్న వర్షానికే నగరంలోని పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోతాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని గంటలుగా భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం జనజీవనాన్ని ఇబ్బందులకు గురి చేసింది.

హైదరాబాద్ లోని పలు కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు ఏరులై పారుతుంది. మూసీ పరివాహక ప్రాంతలోని డ్రైనేజ్ నీరు పొంగిపొర్లుతోంది. అంబర్ పేట లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇల్లులోకి నీరు చేరుకుంది. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇప్పటి వరకూ ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కగా .. హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదదయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు.  మరోవైపు మూసారంబాగ్ వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ వైపు నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

తాజాగా, తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ లోని వాతావరణం చల్లగా ఉంది. ముఖ్యంగా సాయంత్రమైతే చాలు వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: AP CM Jagan: జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలుకు జీవో జారీ..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.