AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌‌‌‌లో కాల్పులు కలకలం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోగిన తుపాకుల మోత

గత నెలలో కూకట్‌పల్లి ఏటీఎం వద్ద దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌‌‌‌లో కాల్పులు కలకలం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోగిన తుపాకుల మోత
Gun Fire
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2021 | 6:06 AM

Share

కూక‌ట్‌ప‌ల్లి ప‌టేల్‌కుంట పార్కు వ‌ద్ద కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండ‌గా ఇద్ద‌రు దుండ‌గులు అకస్మాత్తుగా  కాల్పులు జ‌రిపారు. అనంత‌రం ఆ డ‌బ్బును దుండ‌గులు అప‌హ‌రించి పారిపోయారు.కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరుగాయపడ్డారు ..రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితులు అజిత్ , ముకేశ్ లను పోలీసులు అరెస్ట్ చేసారు.

అలాగే హైదరాబాద్  పాత బస్తిలో తుపాకుల మోత మోగింది. ఎమ్.ఎమ్. ఫిర్దోష్ అనే లాయర్‌కు చెందిన ప్రైవేటు స్థలంలో ఓ వ్యక్తి, తన లైసెన్డ్ గన్‌తో మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో  ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.కాల్పుల అంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని  పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు హైదరాబాద్ నార్సింగి హైదర్ష్ కోట లో కాల్పుల కలకలం రేపాయి. కాల్పులు జరిపిన వ్యక్తి  రిటైడ్ ఆర్మీ జవాన్‌ నాగ మల్లేష్‌ని పోలీసులు అరెస్ట్ చేసారు . నాగ మల్లేష్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. అయితే ఈ కాల్పులకు మందు పార్టీ కారణమని పోలీసులు తేల్చారు. అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటిపై హైరీచ్ ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారని, పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదన్న కోపంతో నాగ మల్లేష్ ఈ కాల్పులు జరిపాడు .

Vijay Saatha  (TV9 Telugu)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pakistan Bus Blast: బాంబు దాడి.. కాదుకాదు గ్యాస్ పేలుడు.. పేలుడు ఘటనపై పాక్ – చైనా కీచులాట

Viral Video: ఘోరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బాలుడు.. వీడియోతో పోలీసుల అవగాహన

Kathi Mahesh: కత్తి మహేష్ మృతి కేసులో మరో ట్విస్ట్.. టీవీ9తో ఆసక్తికర విషయాలు చెప్పిన కత్తి మహేష్ కారు డ్రైవర్

నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ( వీడియో )