TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం

ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం రెండో రోజు కొన‌సాగింది. స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ‌పై కేబినెట్ స‌మ‌గ్రంగా చ‌ర్చించింది.

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం
CM KCR
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 14, 2021 | 9:26 PM

Telangana Cabinet Key Decisions: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్ చర్చించింది. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి, అధికారులు కేబినెట్‌కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది.

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించింది. కేబినెట్ సమావేశానికి హాజరైన అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో వున్న ఉద్యోగుల వివరాలను ఖాళీల వివరాలను కేబినెట్ కు అందించారు.

జిల్లాలు, జోన్ల‌వారీగా ఖాళీల గుర్తింపునకు ఆదేశం

ప్రతి విభాగంలో మంజూరీ అయివున్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో వున్న ఖాళీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా కేబినెట్ ముందుంచారు. నూత‌న జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపున‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూత‌న‌ జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఏర్పడే అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని శాఖ‌ల కార్యద‌ర్శుల‌ను కేబినెట్ ఆదేశించింది.

సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని కేబినెట్ అభ్రిప్రాయపడింది. ఇందుకు అనుగుణంగా కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా సరికొత్త పోస్టులను గుర్తించాలని సూచించింది. కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని తెలిపింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను, అధికారులను కేబినెట్ ఆదేశించింది.

“తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ”కి కేబినెట్‌ ఆమోదం

తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుత వానాకాలం కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగుతోంది. వరి పత్తి పంటలు రికార్డుస్థాయిలో దిగుబడి పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. రైస్ మిల్లుల లో మిల్లింగ్ సామర్ద్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు పారబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 10 జోన్ల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు.. తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్‌.. జనావాసాలు, నిర్మాణాలను అనుమతించకూడదని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తులను జూలై 31 వరకు పొడిగించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది.

రైతులకు శిక్షణా కార్యక్రమాలు

ఇక, రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సిఎం స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను భర్తీ చేసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

మిల్లింగ్, మార్కెటింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీ

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్ననేపథ్యంలో…. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహకం

రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022 – 23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా…ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు, మొదటి సంవత్సరం రూ.26,000 రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5,000 మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది. ఆయిల్ ఫామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్మెంట్ (టి ఐడిఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టి ఎస్ ఎఫ్ పి జెడ్) నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్ సూచించింది.

“తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ”కి కేబినెట్ ఆమోదం

పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఇందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘ తెలంగాణ లాజిస్టిక్స్ పాలసి’ ని కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా నేపథ్యంలో, బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోగ పడ్డదని కేబినెట్ గుర్తించింది. అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థలు లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక , వ్యవసాయ అభివృద్దిలో ఆయా ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అధనపు వాణిజ్యానికి లాజిస్టిక్ రంగాభివృద్ధి ఎంతో అవసరం అని గుర్తించింది.

లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులు

రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా తదితర లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారుగా 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో, సనత్ నగర్లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసిడి తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటేనర్ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరి, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ది పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది.

అన్నిరకాల రంగాలకు చెందిన వస్తువుల నిల్వ సామర్ధ్యం పెంచుకోవడానికి లాజిస్టిక్స్ పాలసీ చేయూతనిస్తుందని కేబినెట్ అభిప్రాయ పడింది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్ లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగాభివృద్ధి ద్వారా ప్రత్యక్షంగా ఒక లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, అందుకోసం గాను రాష్ట్రానికి దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది.

Read Also… Hyderabad City: హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..
ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. కూతురికి ఏం నేర్పిస్తుందో చూడండి
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. కూతురికి ఏం నేర్పిస్తుందో చూడండి
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.